🇮🇳Padmabhushan-C.K NAIDU

🇮🇳పద్మభూషణ్ - సి.కె.నాయుడు

సి.కె.నాయుడు (కఠారి కనకయ్య నాయుడు) 1895-10-31 మహారాష్ట్రలోని నాగపూర్ లో తెలుగు కుటుంబంలో జన్మించాడు. సి.కె. నాయుడు పూర్వీకులు కృష్ణాజిల్లా మచిలీపట్నానికి చెందిన సుప్రసిద్ధ “తెలగనాయుడు” కుటుంబీకులు వారి తాతగారైన కఠారి నారాయణస్వామి నాయుడు గారికి రెండు తరాల ముందే వారి కుటుంబం హైద్రాబాద్కు తరలి పోయింది. నారాయణస్వామి నాయుడు గారి తాతగారు నిజాం నవాబు గారి దగ్గర “దుబాసి” (ద్విభాషి) పనిచేశారు. తర్వాత వారు మకాం “ఔరంగాబాద్” (మహారాష్ట్ర)కు మారింది. చివరకు సి.కె. నాయుడు భారత సైన్యములో కర్నల్ చేసి తర్వాత "హూల్కర్” సంస్థానంలో న్యాయమూర్తిగా ఉంటూ నాగపూర్లో స్థిరపడినారు. సి.కె.నాయుడు అక్కడే పుట్టి పెరిగాడు. సి.కె. ప్రతిభను గౌరవిస్తూ హోల్కర్ సంస్థానాధీశుడు. 1923 సం||లో ఆయనకు తన సైన్యములో అత్యున్నతకర్నల్) ఇండోర్ రావలసినదిగా ఆహ్వానించాడు. నాగపూర్లో పెరిగిన ఈయన పాఠశాల రోజుల నుండే క్రికెట్ ఆటలో ప్రతిభ కనపరిచారు. ఈయన ప్రథమశ్రేణి క్రికెట్ ఆటలో ప్రవేశము 1916లో హిందూ జట్టులో యూరోపియన్ జట్టుకు వ్యతిరేకంగా జరిగింది. ఈయన ఆ ఆటలో తమ జుట్టు -79, పరుగులకు 7 వికెట్లు పడిన పరిస్థితిలో 9వ ఆటగాడిగా బ్యాటింగ్కు దిగాడు. మొదటి మూడు బంతులు అడ్డుకొని, నాలుగో బంతిని సిక్స్ కొట్టారు. ఇలా మొదలైన ఈయన ప్రాబల్యము తన క్రీడా జీవితపు చివరినాళ్ల వరకు చెక్కు చెదరలేదు. ఆరు దశాబ్దాలపాటు "ఫస్ట్ క్లాస్ క్రికెట్" ఆడిన కొద్దిమంది క్రీడాకారులలో సి.కె. నాయుడు ఒకరు భారత తొలి క్రికెట్ జట్టు కెప్టెన్ నాయుడుగారు - 1956-57 రంజీ ట్రోఫీలో తన 62వ యేట అతను చివరి సారి ఆడారు. ఆ మ్యాచ్ లో 52 పరుగులు చేశారు. రిటైరు అయ్యాక కొన్నాళ్లు సెలక్టరుగా,రేడియో వ్యాఖ్యాతగా ఆటతో తన అనుబంధం కొనసాగించారు. తన ఆఖరు రోజుల వరకూ సి.కె.నాయుడు ఇండోర్లోనే స్థిరనివాసము ఏర్పరుచుకున్నారు. మన తెలుగు రాష్ట్రాలలో లేకున్నా సి.కె. ఇంట్లో తెలుగు వాతావరణమే ఉండేదని ఆయన పిల్లలు ఆయనను గురించి వ్రాసిన పుస్తకాలలో వ్రాశారు. తెలుగు సాంప్రదాయాలను పాటిస్తూ, తెలుగు పత్రికలు చదవటం, తెలుగు వస్త్రధారణలో ఉండడం నాయుడు గారి కుటుంబంలో కొనసాగాయి.

క్రికెట్ కెరీర్ : నలభై ఎనిమిదేళ్ల సుదీర్ఘ ఫస్ట్ క్లాస్ కెరీర్లో సి.కె. ముంబై క్వాడ్రాంగులర్స్, పెంటాంగులర్స్, రంజీట్రోఫీ, మద్రాసు ప్రెసిడెన్సీ మ్యాచ్లు, నాగపూర్ క్వాం డ్రాగులర్స్, సూరత్ క్వాండాగులర్స్ అమృతసర్ ట్రయాంగులర్స్, రోషనారా టోర్నమెంట్స్, మెయినుస్టీలా గోల్డ్కప్ ఇలా అనేక టోర్నమెంటులతో ఆడేవారు. ఇవిగాక వివిధ రాష్ట్రాల చీఫ్ మినిస్టర్స్ ఎలెవెన్, గవర్నర్ ఎలెవెన్ జట్లకు కూడా ప్రాతినిధ్యం వహించాడు. మొత్తం 344 మ్యాచ్లు అది 11825 పరుగులు చేశాడు. 411 వికెట్లు తీసుకున్నాడు. విశేషం ఏమిటంటే సి.కె. కెరీర్లో ఆడిన మ్యాచ్లలో సగానికి పైగా ఆయనకు నలభై ఏండ్లు దాటిన తర్వాత ఆడినవే.

రికార్డులు, ఘనతలు : భారత క్రికెట్ జట్టు తొలి కెప్టెన్ 1916లో మొదటి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడిన సి.కె. తన ఆఖరు మ్యాచ్ ఆడింది. 1963 సం॥లో 68 సం॥ వయస్సులో క్రికెట్ చరిత్రలో 48 సం॥రాల సుదీర్ఘమైన కెరీర్ ఉన్నవారు మరొకరు లేరు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో యాభై ఏండ్ల వయస్సు దాటాక కూడా డబుల్ సెంచురీ చేసిన అతికొద్దిమంది ఆటగాళ్లలో సి.కె. ఒకరు. ఇంగ్లండ్ రాణి లాడ్స్ మైదానానికి వచ్చినప్పుడు ఆమెను సిక్సర్ తో స్వాగతం పలికి "బిగ్బాన్" గడియారం గ్లాసు పగలగొట్టిన వీరుడు.

సి.కె. గురించి కొందరు ప్రముఖుల మాటలు: సి.కె. నాయుడు బంతిని అదుకోవడం చూస్తే చాలు. ఆయన క్రికెట్ ఆడటం కోసమే పుట్టాడని అర్ధమవుతుంది. జాకోబ్స్, ఇంగ్లండు క్రికెటర్ నేను హెూల్కర్ పాలకుడినైతే కావచ్చు కానీ, ఔట్ డోర్ గేమ్స్ రారాజు మాత్రం సి.కె. నే! యశ్వంతరావు హోల్కర్ మహారాజా తాత్వికుల చింతన కన్నా ఉన్నతమైన సిక్సర్లతో ఆయన కెరియర్ నిండిపోయింది. డామ్ మొరీస్ రచయిత డగ్లస్ జార్డిన్ జట్టుపై సి.కె. నాయుడు బ్యాటింగ్ జోరు చూశాక విదేశీయులంటే, అప్పటివరకూ నాలో గూడు కట్టుకొని ఉన్న భయం కాస్తా పోయింది. పృథ్వీరాజ్ అప్పటియువ క్రికెటర్, సి.కె. నాయుడుకు భారత్ క్రికెట్ ఎంతగా రుణపడి ఉన్నది. ఆయన భారత క్రికెట్టుకు డబ్లు, జి.గ్రేస్ వంటివాడు ఎస్.కె. గురునాధన్ క్రికెట్ రచయిత ప్రాచ్యదేశాల "మార్మికతను" రంజీ తర్వాత మళ్లీ సి.కె.నాయుడు ముస్తాన్ ఆలీతోనూ మనం చూడగలం, ఇడబ్ల్యు స్వాంటన్ ప్రసిద్ధ క్రీడా రచయిత క్రికెట్ అనూహ్య పరిణామాలకు వేదిక అన్న నానుడికి సి.కె. నాయుడును మనము ఊహించను కూడా ఊహించలేము. నెవిల్ కార్డస్, ప్రసిద్ధ క్రికెట్ రచయిత సి.కె. నాయుడు బౌలర్ తన ఫస్ట్ క్లాస్ కెరియర్ను మొదలుపెట్టి భారీ సిక్సర్లతో సి.కె. నాయుడు అంటే సిక్సర్ల నాయుడు అనిపించుకున్న స్పోర్ట్స్ హీరో ఆయన. ఆడిటోరియంలో ఎవరు చేయెత్తి మావైపు కొట్టమంటే ఆవైపు సిక్సర్ కొట్టే నైపుణ్యం గల ఫస్ట్ క్లాస్ ఆటగాడు.

భారతదేశ టెస్ట్ క్రికెట్ మొట్టమొదటి కెప్టెన్ సి.కె. నాయుడు (1932 ఇంగ్లాండుతో) తొలి టెస్ట్ మ్యాచ్ ఆడిన భారతీయ జట్టుకు కెప్టెన్గా ఉన్నారు. హిందువులు - బ్రిటిష్వారు (ఎం.సి.సి) క్రికెట్టు జట్టు మధ్య పోటీలో అత్యద్భుత బ్యాటింగ్ నైపుణ్యం ముంబాయి ప్రదర్శిస్తూ జింఖానా మైదానాన్ని హోరెత్తించాడు. మొత్తం జట్టు పరుగులు స్కోరు - 187, ఐతే, సి.కె. నాయుడు - 153, పరుగులు, 116 నిమిషాలలో (అంటే రెండు గంటలు లోపే) కొట్టేశాడు. భారతజట్టుకు ప్రధాన సెలెక్టరుగా ఉన్న రోజుల్లో రంజీఫైనల్లో హెూల్డర్ జట్టుకు ఆడుతూ 200 పరుగులు ఫోర్లు - ఆరున్నర గంటలు సాగింది. ఏముందీ? అంటారా? అపుడాయన వయస్సు అక్షరాలా ఏబయి ఒక్కటి 1956-57 రంజీ ట్రోఫీలో తన 62వ యేటఅతను చివరిసారిగా ఆడారు. అప్పటి రాజస్థాన్ జట్టులో ముగ్గురు టెస్టు జట్టు బౌలర్లు కూడా ఉండగా నాయుడు గారు 52 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. అందులో "విసమస్కట్" వేసిన ఒక ఓవర్లో వరుసగా కొట్టిన రెండు సిక్చర్స్ కూడా ఉన్నాయి. కరారి కనకయ్య నాయుడు 1923లో సైనికాధికారిగా పని చేశారు. బ్రిటీష్ జట్టుతో అడేటప్పుడు స్కోరును పరుగు లెత్తించడం, ఈయనకు చాలా యిష్టం. క్రికెటర్లు ప్రకటనలలో కనిపించడం కూడా రోజుల్లో మొదలు C. K. Nay - సి.కె.నాయుడు ఒక "టీ" వ్యాపార ప్రకటనలో కనిపించడంతో మొదలయ్యింది. భారతదేశ తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ గారి చేతుల మీదుగా "పద్మభూషణ్" పురస్కారాన్ని అందుకున్నారు. ఈ పురస్కారము అందుకున్న తొలి క్రికెట్ ఆటగాడు మరియు 1933లో విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అందుకున్నాడు. జట్టును ముందుండి నడిపించడంలో దిట్ట- ప్రముఖ క్రికెట్ ఆటగాడు ముస్తాక్ అలి "షెహజ" (రాజాధిరాజు)గా వర్ణించాడు. సి.జి.మొకార్డ్ని సి.కె.నాయుడు ఓ అద్భుత పరాక్రమ, అగ్రగామి బ్యాట్స్మెన్ అని పేర్కొన్నారు. బేబిహోబ్స్ సి.కె. నాయుడు పుట్టుకతోనే గొప్ప ఆటగాడు అని పేర్కొన్నాడు. ఈమేటి క్రికెటర్ పేరున సి.కె. నాయుడు టోర్నమెంట్స్ ఏటా నిర్వహిస్తున్నారు. ప్రతిష్టాత్మక సి.కె.నాయుడు లైఫ్ టైం అచీవ్మెంటు అవార్డు నెలకొల్పి ఐదు లక్షల రూపాయలు నగదుతో సత్కరిస్తున్నారు. ఈ అవార్డులు అందుకున్న వారిలో, మన్సూర్ అలిఖాన్ పటౌడీ, నింబాల్కర్, చందూబొర్డే, భగవత్ చంద్రశేఖర్, వెంకటరాఘవన్, బిషన్ సింగ్్బడి, ఎర్రపల్లి ప్రసన్న వంటి మేటి ఆటగాళ్లు ఉన్నారు. సి.కె.నాయుడు స్టామీనా గురించి రెండు కథలు ఆయన ఆడిన చివరి టెస్టు ఇన్నింగ్స్లో ఇంగ్లాడ్ కెప్టెన్ గబ్బీ అలెన్ వేసిన బౌన్సర్ ఆయన గుండెల వద్ద బలంగా తాకితే ఆయన అరచిన అరుపు గ్రౌండంగా వినిపించండట. అప్పుడు కూడా సాయానికని వస్తున్న వారిని వారించి, వెంటనే లేచి నిలబడి, తదుపరి బంతిని బౌండరీని తరలించడమే గాకుండా మ్యాచ్లో ఎనభై ఒక్క పరుగులు కూడా చేశాడు. ఆయనకు ఏఐయి. యేళ్లప్పుడు హోల్కర్ జట్టు, సి.కె. నాయుడు సారధ్యంలో బాంబేతో రంజీ ఫైనల్కు సిద్ధమైంది. ఇన్నింగ్స్ మొదట్లోనే దత్తూఫాడ్కర్ వేసిన బంతి ఒకటి. ఆయన నోటిని గట్టిగా తాకింది. ఊడిపోయిన మూడు ముందు పండ్లు సంగతి ప్రక్కనబెట్టి ఆయన ఆటకొనసాగించారు. సి.కె. నాయుడు ఆయనపై గౌరవంతో వేగం తగ్గించిన పాడ్కురు మందలించి చివరకు ఆ ఇన్నింగ్స్ లో ఆరవై పరుగులు చేశాడు. మొత్తం 344 మ్యాచ్లు ఆడి 11,825 పరుగులు చేశాడు. 411 వికెట్లు తీసుకున్నాడు. అత్యుత్తమ స్కోరు 200 సెంచరీలు, 26 అర్థ సెంచురీలు, 28 తీసిన వికెట్లు 411, పట్టిన క్యాచ్లు 170 ఆయనకు వయస్సుతో వచ్చే అనారోగ్యాలు తప్పలేదు. నాయుడికి 1967 ఏప్రిల్లో నాయుడు మంచం పట్టాడు.క్రమంగా జ్ఞాపకశక్తి కోల్పోయాడు. వచ్చినవారిని గుర్తుపట్టలేని పరిస్థితి, చాలామంది అభిమానులు వి.ఐ.పి.లు చూసేందుకు వచ్చేవారు. అలా ఆరునెలల పాటు సి.కె. నాయుడు మంచంలో గడపాల్సి వచ్చింది. చివరకు 1967-11-14వ తేదీ సి.కె. నాయుడు (ఇండోర్ - M.P.లో) కన్ను మూశాడు. ఆంధ్రప్రాంతంపై ఉన్న మక్కువతో తన 60 సం॥ వయస్సులో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున రంజీ మ్యాచ్లు ఆడారు. దీనికి కారణం ఆ రోజుల్లో ఏ జట్టయినా అధికారికంగా రంజీ మ్యాచ్లు ఆడాలంటే ఆ జట్టులో టెస్టు మ్యాచ్లు ఆడిన క్రికెటర్ ఉండాలి. అనే నిబంధన ఉండేది. తెలుగువాడిగా ఆంధ్రాపై ఉన్న అభిమానంతో ఆ వయస్సులో ఆంధ్రా టీం తరఫున రంజీ మ్యాచ్లు ఆడారు. విశాఖపట్నంలో కట్టిన స్టేడియంకు సి.కె.నాయుడు పేరు పెట్టమని స్పోర్ట్స్ జర్నలిస్టులు క్రికెట్ అభిమానులూ ఎందరో కోరినా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పెడచెవిని పెట్టింది. ఆంధ్రా టీం కోసం సి.కె. నాయుడు చేసిన సేవలకు రుణం తీర్చుకోలేకపోయింది. మొన్నటివరకు చెత్తకుప్పలో ఉన్న సి.కె. నాయుడు గారి విగ్రహం ఎట్టకేలకో, మన భారతరత్నకు అర్హులు, పద్మభూషణ్ కర్నల్ కఠారి కనకయ్య నాయుడు గారి విగ్రహ ప్రతిష్టకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. కృష్ణాజిల్లా కలెక్టరు శ్రీయుతులు లక్ష్మీకాంతం గారు అమెరికా పయనించినపుడు A.P.T.A (అప్తా) అధ్యక్షులు గోపాలకృష్ణ గూడపాటి గారు ఆయనకు విన్నవించి కార్యరూపం దాల్చేలా చేశారు. విగ్రహావిష్కరణ 2018-4-4 తేది జరిగింది. సి.కె.నాయుడు మరణానంతరం అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి - మచిలీపట్నంలో ఒక వీధికి సి.కె. నాయుడు పేరు పెట్టారు. సి.కె. నాయుడు సోదరుడు కూడా ప్రముఖ క్రికెటర్ సి.కె.నాయుడు కుమార్తె - చంద్రవతీ నాయుడు భారతదేశములోని తొలి మహిళా క్రికెట్ కామెంటర్.

 రచయిత - బట్టరుశెట్టి పద్మారావు రాయులు