Andhra Pradesh Deputy CM Pawan Kalyan.
Andhra Pradesh Deputy CM Pawan Kalyan.
Admin
Author
Andhra Pradesh Deputy CM Pawan Kalyan
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
కొణిదెల పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 2, 1971న తెలంగాణలోని అమన్‌గల్‌లో జన్మించారు, అసలు పేరు కొణిదెల కళ్యాణ్ కుమార్. మెగాస్టార్ చిరంజీవి సోదరుడైన ఈయన తెలుగు సినిమా నటుడిగా, రాజకీయ నాయకుడిగా, సామాజిక సేవకుడిగా, మార్షల్ ఆర్టిస్ట్‌గా విస్తృత గుర్తింపు పొందారు. సినీ రంగంలో "పవర్ స్టార్" గా ప్రసిద్ధి చెందిన ఈయన అనేక విజయవంతమైన తెలుగు చిత్రాలలో నటించి భారీ అభిమాన వర్గాన్ని సంపాదించుకున్నారు. 2014లో జనసేన పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి అధికారికంగా అడుగుపెట్టారు, అంతకుముందు 2008-2011 మధ్య ప్రజారాజ్యం పార్టీతో కూడా అనుబంధం కలిగి ఉన్నారు. 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో పిఠాపురం నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలుపొందారు, జూన్ 4, 2024న శాసనసభ్యుడిగా బాధ్యతలు స్వీకరించారు.
తెలుగుదేశం పార్టీ (టిడిపి), జనసేన, బిజెపి కూటమి 2024 ఎన్నికలలో విజయం సాధించడంతో, ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని మంత్రివర్గంలో పవన్ కళ్యాణ్ జూన్ 12, 2024న ఆంధ్రప్రదేశ్ 11వ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈయనకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు కేటాయించారు. ఈ పదవిలో ఉంటూ పరిశ్రమలు 33% పచ్చదనం పాటించాలని, దాన్ని క్రమంగా 50%కి పెంచాలని కోరడం వంటి అనేక పరిపాలనా కార్యక్రమాలు చేపట్టారు. ఏప్రిల్ 2026లో ఈయన శస్త్రచికిత్స చేయించుకున్నారు, ఆ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు. అనంతరం భుజం శస్త్రచికిత్స తర్వాత కేరళలో కొన్ని వారాలపాటు పునరావాస చికిత్స (రిహాబిలిటేషన్) పొందిన పవన్ కళ్యాణ్, సెప్టెంబర్ 2026 మధ్యలో చికిత్స పూర్తి చేసుకుని ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి వచ్చి తన పరిపాలనా విధులను తిరిగి కొనసాగించేందుకు సిద్ధమవుతున్నారు.
వ్యక్తిగత జీవితంలో పవన్ కళ్యాణ్ మూడుసార్లు వివాహం చేసుకున్నారు — నందినితో (1997లో వివాహం, 1999లో విడిపోయారు, 2008లో విడాకులు), రేణు దేశాయ్‌తో (2009-2012), ప్రస్తుతం అన్నా లెజ్నేవాతో (2013 నుండి) కొనసాగుతున్నారు, వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు.
.పవన్ కళ్యాణ్ అంతర్జాతీయ అవార్డ్స్ :
17-11-2017లో బ్రిటన్ పార్లమెంటులో ప్రధాని "ఉద్దానం”లో కిడ్నీ సమస్యపై - ఐ,ఈ,బి.ఎఫ్ గుర్తింపు, ఇండోయూనియన్ బిజినెస్ ఫోరం (IEBF) వివిధ రంగాలకు
ఏటా ఇచ్చే ఎక్స్టెన్స్ అవార్డుకు ఎంపికయ్యారు. ఇన్వెస్ట్ న్యూ ఇండియా పేరుతో బ్రిటన్ పార్లమెంటులో జరిగే సభ సందర్భంగా 17-11-2017 అవార్డు అందుకున్నారు.
శ్రీకాకుళం జిల్లా కిడ్నీ సమస్య, చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా కళాకారులకు ఎన్నుదన్నుగా నిలిచిన తీరుకు స్పందించి, ఈ అవార్డు ఎంపిక చేసినందుకు, IEBF ఇండియా విభాగం ప్రతినిధి సునీల్‌కుమార్ గుప్తా, కో ఆర్డినేటర్ చంద్రశేఖర్ తెలిపారు. అమెరికాలోని హార్వర్డ్ యూనివర్శిటీ ఇదివరకే పవన్‌కళ్యాణ్‌ను గౌరవించగా ఇప్పుడు "హౌస్ ఆఫ్ లార్డ్స్" లో పవన్ పురస్కారము అందుకున్నారు.
విలక్షణ నటుడు పవన్ కళ్యాణ్. చిరంజీవి గారి రెండవ తమ్ముడు. వీరు ఇంటర్ వరకు చదువుకున్నా, ప్రపంచ జ్ఞానాన్ని అవపోషణ పట్టిన మేధావి. ఈయన "అక్కడ అబ్బాయి- ఇక్కడ అమ్మాయి" సినిమా ద్వారా తెలుగు చిత్ర సీమలో అడుగుపెట్టారు. మొదటి సినిమాతోనే తన ప్రత్యేకతను చాటుకునేందుకు తను చేసిన హార్డువర్క్ వెండితెర సాక్షిగా ప్రపంచానికి వెల్లడైనప్పుడు, చిరంజీవి సోదరుడు అనే ఇమేజ్ నుండి బయటపడి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకునేందుకు తపన పడుతున్నాడని సినీ ప్రపంచం గుర్తించింది. ఆయన స్టెయిలే వేరు. ఆయన నటన విలక్షణంగా ఉంటుంది. అది మొదలు పవన్ ఏ సినిమా చేసినా ప్రేక్షకాభిమానులు బ్రహ్మరథం పెట్టారు.
సంవత్సరం
సినిమా
1996
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి
1997
గోకులంలో సీత
1998
సుస్వాగతం
1998
తొలిప్రేమ
1999
తమ్ముడు
2000
బద్రి
2001
ఖుషి
2003
జానీ
2004
గుడుంబా శంకర్
2005
బాలు
2006
బంగారం
2006
అన్నవరం
2008
జల్సా
2010
పులి
2011
తీన్మార్
2011
పంజా
2012
గబ్బర్ సింగ్
2012
కెమెరామెన్ గంగతో రాంబాబు
2013
అత్తారింటికి దారేది
2015
గోపాల గోపాల
2016
సర్దార్ గబ్బర్ సింగ్
2017
కాటమరాయుడు
2018
అజ్ఞాతవాసి
2021
వకీల్ సాబ్
2022
భీమ్లా నాయక్
2023
బ్రో
2025
హరి హర వీర మల్లు
2025
They Call Him OG
2026
ఉస్తాద్ భగత్ సింగ్
కలియుగ దానకర్ణుడు పవన్ కళ్యాణ్ గుప్త దానాల పై కోటిపల్లి కాలం... సరికొత్త ఆర్టికల్
* శిక్షణ ఇచ్చిన గురువు సత్యానంద్ గారికి అడగకుండానే రెండుసార్లు లక్ష రూపాయలు. సహాయం చేసి సత్యానంద్ గారి వ్యక్తిగత అవసరాలను తీర్చారు 1993 లో పవన్ కళ్యాణ్ పెద్ద హీరోకూడా కాదు.
* 1993లో తొలిప్రేమ సినిమా ద్వారా వచ్చిన రెమ్యునరేషన్లో విసి ఆర్ అనాథ ఆశ్రమానికి లక్ష రూపాయలు విరాళం.
* 1998 లో షూటింగ్ లో చనిపోయిన వ్యక్తికి లక్షా యాబై వేల రూపాయల ఆర్ధిక సహాయం అందించారు.
* 1999 లో కార్గిల్ వార్ సైనికుల సంరక్షణ కొరకూ లక్ష రూపాయలు ఆర్ధిక సహాయం అందించారు.
* 2005 లో సునామీ బాధితులకు బాను ప్రాంచైజీ ద్వారా ఆర్థిక సహాయం అందించారు.
* జల్సా సినిమా సమయంలో క్యాన్సర్ సోకిన చిన్నారులకు ఆర్ధిక సహాయం, వైద్య ఖర్చులకు పూర్తిగా సహాయం అందించారు.
* బంగారం సినిమా సమయంలో చిన్నపాప కు గుండె ఆపరేషన్ కోసం 3 లక్షలు ఆర్ధిక సహాయం చేశారు.
* ప్రజారాజ్యం ప్రచార సమయంలో చనిపోయిన కార్యకర్తకు లక్షా 30 వేలు ఆర్ధిక సహాయం అందించారు.
* అనారోగ్యంతో చనిపోయిన అభిమాని వెంకటేష్ కుటుంబానికి 7 లక్షలు ఆర్ధిక సహాయం అందించారు.
* కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న సురేష్ అనే అభిమానికి 2 లక్షలు ఆర్ధిక సహాయం అందించారు.
* ఖమ్మం జిల్లాలోని పాండు రంగాపురం జీసెస్ అనాధాశ్రయనికి లక్షా 10 వేలు సహాయం.
* ఖమ్మంలో శ్రీజ కు క్యాన్సర్ సోకితే 2 లక్షలు మరియు వైద్య సహాయం. అందుకే చనిపోతుంది అనుకున్న శ్రీజ బ్రతికి ఏ గుడికి వెళ్లిన మొక్కే మొదటి మొక్క నా దేవుడు, మావయ్య పవన్ కళ్యాణ్ సీఎం కావాలి అని
* దివ్యంగుల రెండో కిక్రెట్ టోర్నమెంట్ కి 5 లక్షలు ఆర్థిక సహాయం 0 బీద బ్రహ్మిన్స్ కుటుంభానికి చెందిన సత్తిరాజు, విజయకృష్ణ దంపతుల చిన్న కుమార్తె
* రేవతి కండరాల వ్యాధికి మైసూర్ పంపి పూర్తి వైద్య సహకారం 20 వేలు కుటుంబానికి టిక్కెట్స్ బుక్ చేశారు
* ఆంద్ర వర్ధ మాన షూటర్ రేఖ కోచింగ్ కోసం 5 లక్షలు సహాయం
* అసిస్టెంట్ కెమెరా మెన్ రవి భార్యకి ఆరోగ్యం బాగోక పోతే వైద్యం కోసం 25 లక్షలు ఆర్థిక సహాయం.
* ఆధునిక మహాభారతంలి రచయిత గుంటూరు శర్మ గారు పుస్తకం సమాజానికి ఉపయోగ పడుతుంది పూర్తి ముద్రణ ఖర్చు మరియూ కుటుంబానికి ఆర్ధిక సహాయం అందించారు.
* కాకినాడ మీటింగ్ లొ చెట్టు కొమ్మ విరిగి చనిపోతే జనసేవ దళ్ నుంచి 5 లక్షలు ఆర్ధిక సహాయం.
* సర్దార్ సినిమా ఆడియో రిలీజ్ సందర్భంగా వికలాంగులుకు ఆర్థిక సహాయం.
* హమాచల్ ప్రదేశ్ చనిపోయిన 24 మంది తెలుగు రాష్ట్రాల కుటుంబాలకు లక్ష చప్పున 24 లక్షలు ఇవ్వడం జరిగింది.
* యాసిడ్ దాడిలో గాయపడిన ప్రణీత కి ఉన్నత చదువులు కు వైద్య ఖర్చులకు సహాయం మోరల్ సపోర్ట్ అందించారు.
* ప్రజారాజ్యంలో పార్టీకి సహాయ సహకారాలు అందించిన ఎన్నో వందల బీద కుటుంబాలకు ఆస్తులు అమ్మి ఆర్థిక సహాయం అందించారు పవన్ కళ్యాణ్.
* విశాఖపట్నం లో కరెంట్ షాక్ లో మరణించిన అభిమానులు కుటుంబాలకు చెరో మూడు లక్షలు ఇవ్వడమే కాకుండా పిల్లల చదువుకు ఫీజులుకట్టడం.
* అస్తులు కోసం కన్న తల్లిదండ్రులను తోబుట్టువుల ను కడతేర్చే ఈలోకంలో అన్న నాగబాబు కోసం డబ్బులు లేకున్నా గబ్బర్ సింగ్ సినిమా తీసి వచ్చిన 40 కోట్ల డబ్బులు ఇచ్చి అప్పులు తీర్చేశారు.
* ఖమ్మంలో కష్టాల్లో ఉన్న అభిమాని కుటుంబానికి 2 లక్షలు ఆర్ధిక సహాయం.
* అరకు పర్యటనలో ఆంత్రాక్స్ వ్యాధి సోకి తామర తో గజ్జి తో ఉన్న పిల్లల్ని ముద్దాడి అంటు వ్యాధి సోకిన పిల్లల్నిమరో మదర్ థెరిసా ఎత్తుకున్నారు. ఆంత్రాక్స్ కి మెడిసిన్స్, ఆహారం అందించారు. త్రాగునీటిని సొంత డబ్బుతో పరిశోధన కు పంపించారు.
* అత్తారింటికి దారేది సినిమాకి ఇచ్చిన చెక్కులో 70% సొమ్మును నేషనల్ సెక్యూరిటీ ఫండ్ అందించారు.
* గోపాల గోపాల సినిమా షూటింగ్ సమయంలో ఇంటి నిర్మాణం కోసం అభిమానికి 50 వేలు ఆర్ధిక సహాయం అందించారు.
* కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి 11 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం అందించారు.
* అనారోగ్యంతో బాధపడుతున్న అభిమాని గుబ్బల సతీష్ 50 వేలు ఆర్ధిక సహాయం అందించారు.
* క్యాన్సర్ తో బాధపడుతున్న విష్ణుప్రియాకు 2 లక్షలు ఆర్ధిక సహాయం అందించారు.
* తుమ్మలపాలెం షుగర్ ఫ్యాక్టరీలో పనిచేసే అభిమాని ప్రమాదశాత్తూ చనిపోతే లక్షరూపాయల ఆర్థికసహాయం అందించారు.
* దామోదరం సంజీవయ్యా స్మారక భవనానికి కోటిరూపాయల విరాళం అందించారు.
* కరోనా కష్ట కాలంలో ఆంధ్రప్రదేశ్ కి 50 లక్షలు, తెలంగాణ కి 50 లక్షలు కేంద్రానికి కోటిరూపాయల ఆర్ధిక సహాయం అందించారు.
* వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిత్యాన్నదానానికి కోటి పదిలక్షల రూపాయలు విరాళం అందించారు.
* గుంటూరు పానకాల స్వామి గుడి కి భారీ విరాళం అందించారు.
* చిలుకూరి బాలాజీ స్వామి వారి ఆలయానికి 9 లక్షల రూపాయలు విరాళం అందించారు.
* అయోధ్య రామమందిరం నిర్మాణం కోసం 32 లక్షల రూపాయలు విరాళంగా అందించారు.
* విజయవాడలో కనకదుర్గమ్మ ఆలయానికి 3 లక్షల రూపాయలు విరాళంగా అందించారు.
* అన్నవరం దేవాలయానికి మరమ్మతులు కోసం 5 లక్షలు విరాళంగా అందించారు.
* కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భారీ విరాళం అందించారు.
* అన్నవరం సినిమా షూటింగ్ అయ్యాక ఇంటికి వెళ్తున్న సమయంలో రోడ్డుపై ఎవరో తెలియని వ్యక్తీ కి యాక్సిడెంట్ అయితే దారిలో కారు ఆపి తన కారులో క్రేజీ హెచ్ ఆసుపత్రికి తీసుకుని వెళ్లి నిరుపేద అని తెలుసుకుని బ్లాంకు చెక్కు ఇచ్చి వైద్య ఖర్చులు తానే భరించారు.
* హైదరాబాద్ లో మానసిక వికలాంగుల ఆశ్రమాలకు భారీ విరాళాలు అందించారు.
* పవన్ కళ్యాణ్ లెర్జింగ్ సెంటర్ ఫర్ హ్యమన్ ఎక్సలెన్స్ ద్వారా పేద విద్యార్థులకు ల్యాప్ టాప్ అందించారు, పేద విద్యార్థుల చదువులు కోసం లక్షరూపాయల విరాళం అందించారు.
* ఆత్మహత్య చేసుకున్న వెంగయ్య కుటుంబానికి 8 లక్షల 50 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు.
* అండర్ 19 క్రికెట్లో ఎదుగుతున్న వర్ధమాన క్రికెటర్ షేక్ రషీద్‌కు 2 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం అందించారు.
* హీరోయిన్ సమంత ఏర్పాటు చేసిన ప్రత్యూష ఫౌండేషన్ కి మహేష్ బాబుతో కలసి ఆర్థిక సహాయం అందిస్తూఉన్నారు.
* మనం సైతం ఫౌండేషన్ కి ఆర్ధిక సహాయం చేసి యాక్టర్ సుభాషిణి గారికి 2 లక్షలు క్యాన్సర్ వైద్యం కి సహాయం.
* పావలా శ్యామల గారు గబ్బర్ సింగ్ షూటింగ్లో కలిసి ఆరోగ్యంబాగోలేదు అనగానే లక్ష రూపాయలు ఆర్ధిక సహాయం ఆదరించిన తీరు ప్రతి ఇంటర్వ్యూలో చెప్తారు.
* 2015లో ప్రత్యేక హోదా కోసం అమరుడు అయ్యిన మునికోటి కుటుంబానికి 2 లక్షలు ఆర్ధిక సహాయం అందించారు.
* కమెడియన్ కాదంబరి ఏర్పాటు చేసిన మనం సైతం ఫౌండేషన్ కి ఆర్ధిక సహాయం అందిస్తున్నారు
* మహబూబ్ నగర్ ప్రమాదానికి గురైన అభిమాని కొట్టే వెంకటేష్ యాదవ్క 5 లక్షలు సహాయం.
* కామన్ మెన్ ప్రొటక్షన్ ఫోర్సికి, కోటి 20 లక్షలు సహాయం.
* సర్దార్ ఆడియో ఫంక్షన్ లో చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయిస్తాను అని ఆ సినిమా తగినంత స్థాయిలో అడక పోయినా తన సొంత బెంజ్ కారును 2 కోట్లకు అమ్మి వైద్యం చేయించారు.
* తమిళనాడులో వరదలు నిమిత్తము తనకి ఉన్న రెండో బెంజ్ కారును అమ్మి 2 కోట్లు ఇవ్వడం జరిగింది. బెంజ్ కార్లు రెండు అమ్మి స్కోడా కారుకే పరిమితం
* అయ్యారు 0 క్రీడాకారుడు సురేష్ కి ట్రైన్ యక్షడెంట్ అయ్యితే 5 లక్షలు సహాయం.
* కోమరం పులి క్రేయేటివ్ డైరెక్టర్ సూర్యకి సినిమా రెమ్యునరేషన్ వెనక్కి ఇవ్వడం
* కామిడీ యాక్టర్ ఆంజనేయులు గారి కుటుంబ పరిస్థితి తెలుసుకుని గబ్బర్ సింగ్ లో హరీష్ శంకర్ గారికి చెప్పి పాత్ర ఇప్పించి ఆదుకున్నారు.
* 2012 లో ఉత్తరాఖండ్ వరదల కి 20 లక్షలు సహాయం.
* 2015 లో విశాఖపట్నం లో హుద్ హుద్ తుఫానుకు 50 లక్షలు ఆర్ధిక సహాయం చేసారు.
* జానీ సినిమా ఫ్లాప్ అయ్యితే డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డిగారికి ఆర్ధిక సహాయం చేయడం జరిగింది.
* బైకర్ గోదా సతీష్ గారికి 5 లక్షలు ఆర్ధిక సహాయం.
* సినిమాల్లో హెయిర్ స్టయిల్ చేసిన రాం కి సెలూన్ షాప్‌కి ఓపెనింగ్‌కి వెళ్లి కొంచెం మొత్తం ఆర్థిక సహాయం.
* కోట్లు వచ్చే యాడ్స్ వదిలి చేనేత కార్మికులకు అంబాసీడర్ గా వ్యవహరించడం
* ఆజ్ఞాత వాసి షూటింగ్లో సరదాగా ఫోటో దిగితే ఆయన కాశీలో జాబ్ చేస్తూ చనిపోయారని పేపర్ లో చూసిన వెంటనే ఆ కుటుంబ పరిస్థితి తెలుసుకుని లక్ష ఆర్ధిక సహాయం చేశారు.
* హైదరాబాద్ లో నగర శివారులో షూటింగ్ జరుగుతుంటే రోడ్డు పక్కన పనిచేసే ఒక ఆవిడ సెక్యూరిటీ వారిస్తున్నా వెళ్లి పవన్ కాళ్ళ దగ్గర తన బిడ్డకి ప్రాణం పోయండి దేవుడా ఒంట్లో బాగోలేదు అని ఏడిస్తే వెంటనే ఆ బిడ్డని చేతుల్లోకి తీసుకుని మహేష్ బాబు లాంటి సినీ ప్రముఖులు పిల్లలకు వైద్యం చేసే రైన్ బో ఆసుపత్రికి పంపించి వైద్యం చేయించి బ్రతికించి తిరిగి వారి ఇంటికి కూడా వెళ్లారు.
* ఆర్ట్ డైరెక్టర్ శేష గిరి అబ్బాయికి ఒంట్లో బాగోక పోతే రైన్బో ఆసుపత్రిలో వైద్యం చేయించి ప్రాణం పోశారు రైన్ బో లో వైద్యం అంటే ఖర్చు అందరికి తెలుసు.
* 2009 లో ఆదిలాబాద్ తండాలులో మారుమూల ఉన్న కొలం గూడా గోండు గూడా గ్రామాల్లో నీరులేక తండా వాసులు ఇబ్బంది పడుతుంటే సొంత డబ్బుతో రెండు మంచినీటి బోర్లు ఏర్పాటు చేశారు.
* బద్రి సినిమాలో వాడిన బైకులు వేలం వేసి వాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కి విరాళం ఇవ్వడం జరిగింది.
* 2013 లో నేషనల్ కలమిటి కి ఆర్ధిక సహాయం.
* పబ్లిక్ మీటింగ్ వెళ్లినప్పుడు హైదరాబాద్ లో తోపు లాటలో మరణించిన అభిమాని కుటుంబానికి లక్షా 50 వేలు సహాయం.
* గోపాలా గోపాలా మూవీ ఆడియో లాంచ్ తిరుగు ప్రయాణంలో గాయపడ్డ కొత్తురు శ్రీనివాస్ కుటుంబానికి వైద్య ఖర్చులు మరియు 50 వేలు సహాయం.
* దారుణహత్యకు గురైన చిన్నారి చైత్ర కుటుంబానికి 2.5 లక్షల ఆర్ధిక సహాయం అందించారు.
* పవన్ కళ్యాణ్ కోసం పనిచేస్తున్న వ్యక్తిగత సిబ్బంది కుటుంబాల కోసం 13 లక్షల 50 వేలు రూపాయలు ఖర్చు చేశారు.
* క్యాన్సర్ బాధపడుతున్న ఉడిదయ్య కు లక్షరూపాయల ఆర్ధిక సహాయం అందించారు.
* వాయిద్య కళాకారుడు కిన్నెర మొగలయ్య కు 2 లక్షల రూపాయలు ఆర్ధిక సహాయం అందించారు.
* ఇసుక కొరతతో ఆత్మహత్య చేసుకున్న తాపీమెస్ట్రీ బ్రహ్మాజీ కుటుంబానికి లక్షరూపాయల విరాళంగా అందించారు.
* సభకు స్థలం ఇచ్చిన ఇప్పటం గ్రామపంచాయతీ కి 50 లక్షల ఆర్ధిక సహాయం అందించారు.
* రోడ్లు విస్తరణ పేరుతో జనసేన సభకు స్థలం ఇచ్చిన కారణంగా నష్టపోయిన ఇప్పటం గ్రామస్తులకు ఇంటికి లక్ష రూపాయలు చొప్పున ఆర్ధిక సహాయం అందించారు.
* జంగారెడ్డిగూడెం కల్తీ సారా బాధిత కుటుంబాలకు 20 వేలు చొప్పున 60 కుటుంబాలకు ఆర్థికసహయం అందించారు.
* కిలిమంజారో అధిరోహించిన ఆశా దాళ్వాయికి లక్షాయాభై వేల రూపాయలు ఆర్ధిక సహాయం అందించారు.
* సినీ కళాకారులకు షూటింగ్ సమయంలో మంచి భోజనాలు పెడుతున్న ప్రొడక్షన్ చీప్ పచ్చల ప్రకాష్ కి 20 లక్షల రూపాయలు ఆర్ధిక సహాయంగా అందించారు.
* ఎందరో చిన్న చిన్న ఆర్టిస్టులకు తన సినిమాల్లో పాత్రలు ఇప్పించి ఆదుకున్నారు.
* 75 ఏళ్ల స్వాసంత్య్ర భారతంలో సుమారు 1100 రాజకీయ పార్టీలు ఏర్పడ్డాయి ఏ పార్టీ కూడా కార్యకర్తల కోసం ఆలోచన చేయలేదు మొదటిసారిగా కార్యకర్తలకు 5 లక్షల రూపాయల ప్రమాద భీమాను ఇవ్వడం కోసం రెండేళ్లలో మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రమాద పాలసీలు చేయించారు.
* దేశంలో కౌలు రైతులు,చిన్న సన్నకారు రైతుల ఆత్మహత్యలు ఎన్నో జరిగాయి కానీ మొదటిసారిగా 3 వేల మంది రైతు కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున 30 కోట్ల రూపాయలు ఆర్ధిక సహాయం అందించారు.
* చనిపోయిన రైతు కుటుంబాల పిల్లల చదువులకు అయ్యే ఖర్చు కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడం జరిగింది.
* గోదావరి పడవ ప్రమాద బాధిత కుటుంబాలకు లక్ష చొప్పున ఆర్ధిక సహాయం అందించారు.
* ఇవన్నీ సహాయం పొందిన వ్యక్తులు చేస్తే బయటకు వచ్చాయి బయటకు రానివి ఇంకెన్నో.
* ఐటి సోదాల్లో పాల్గొన్న అధికారులు మా సర్వీస్ లో ప్రజల కోసం ఇన్ని దానాలు చేసిన వ్యక్తిని మొదటి సారి చూస్తున్నాం అని ఆశ్చర్య పోయారు అంటే పవన్ కలియుగ కర్ణుడు అనడంలో సందేహం లేదు కదా.
* 2023 బాలానూర్ (ఒరిస్సా) 300 మంది రైలు ప్రమాదంలో చనిపోయారు. 50 కోట్లు ఇచ్చారు.
No comments yet. Be the first to comment!