🇮🇳 పద్మశ్రీ సుకుమారి (Sukumari) నర్తకి, ఫిల్మ్ యాక్టర్
🇮🇳 పద్మశ్రీ సుకుమారి (Sukumari) నర్తకి, ఫిల్మ్ యాక్టర్
Admin
Author🇮🇳 పద్మశ్రీ సుకుమారి (Sukumari)
నర్తకి, ఫిల్మ్ యాక్టర్
దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో 2500 పైగా సినిమాల్లో నటించిన ఒక దిగ్గజ బహుముఖ నటి. ఈమె ప్రధానంగా మలయాళ, తమిళ చిత్రాలలో నటించినప్పటికీ, తెలుగు ప్రేక్షకులకు కూడా ఆమె సుపరిచితురాలే. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'మురారి' సినిమాలో శబరి (నాయనమ్మ) పాత్రతో ఆమె తెలుగు వారి హృదయాల్లో బలమైన ముద్ర వేశారు.
జననం: 6 అక్టోబర్ 1940, నాగర్‌కోవిల్ (ప్రస్తుత తమిళనాడు) బలిజ నాయుడు కుటుంబంలో జన్మించారు
కుటుంబం: ఈమె ప్రముఖ నటీమణులు, నాట్యమణులైన "ట్రావెన్కోర్ సిస్టర్స్" (లలిత, పద్మిని, రాగిణి) లకి కజిన్ (మేనకోడలు వరుస) అవుతారు.వివాహం: 1959లో ప్రముఖ దర్శకుడు ఎ. భీమ్‌సింగ్ గారిని వివాహం చేసుకున్నారు. ఆయన 1978లోనే మరణించారు.
ప్రవేశం: కేవలం 10 సంవత్సరాల వయసులోనే బాలనటిగా సినిమా రంగ ప్రవేశం చేశారు.
వారి తల్లి సరస్వతీదేవి. సుకుమారికి మేనత్త, ఎపుడూ పద్మినీ వెంట వుంటూ ఆమె నాట్యబృందంలో నాట్యం చేస్తూండే వారు. ఈ నటించిన తొలిచిత్రం "ఒరుఇరవు" అనే తమిళచిత్రం. ఇది అన్నాదురై (మాజీ ముఖ్యమంత్రి తమిళనాడు) గారి రచన. తెలుగులో లలితగారు, దేవదాసు సినిమాలో వేశ్యపాత్ర ధరించారు. అపుడు సుకుమారిని చూసిన అక్కినేని నాగేశ్వరరావు. ఆమెకు మాంగల్యబలం (1959) చిత్రంలో రాజసులోచనతో “ఔనంటారా,మీరు కాదంటారా" అనే పాటకు నృత్యం చేసే అవకాశం కల్పించారు అలాగే, తిరుపతి వెంకటేశ్వరా! దొరా! నీవే దిక్కని నమ్మినామురా! పాటలో నటించారు. లవకుశ (1963) “విరిసే చల్లని వెన్నెల" అనే పాట ఈమె కోసం నటి రాజసులోచన చెప్పగా ఆమె భర్త సి.ఎస్.రావు గారు చిత్రీకరించారు. పాత్రల విషయానికొస్తే తెలుగులో పల్లెటూరి బావ చిత్రంలో లక్ష్మి తల్లిగా నటించారు. అనంతరం పలు తెలుగు, తమిళ, మళయాళ, ఒరియా, బెంగాలి వంటి భాషల సినిమాలలో 2400 సినిమాలకు పైగా చిత్రాలలో నటించారు. వీరి నటనలో మనకు గుర్తుండిపోయే చిత్రాలు, నిర్ణయం, మురారి చిత్రాలలో నటించారు.
ప్రముఖ హీరోయిన్ నర్తకి, నటి, రాజసులోచనతోనూ, జయలలిత గార్లతోనూ సుకుమారికి మంచి స్నేహముండేది. రాజసులోచన స్థాపించిన పుష్పాంజలి నాట్య శిక్షణాలయంలో సుకుమారిగారిది కీలకపాత్ర. 1963లో రాజసులోచన ప్రదర్శించిన పద్మావతీ శ్రీనివాస కళ్యాణంలో సుకుమారి శ్రీనివాసుడి పాత్ర ధరించేది. దాదాపు 25 సం||లు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. అలాగే భామాకలాపం, ఆండాల్ కళ్యాణం వంటి నృత్యరూపకాలులో రాజసులోచన నాయకిగా, సుకుమారి నాయకుడిగా నటించే వారు. నటి రాజసులోచనతో వియ్యపురాలిగా తన స్నేహబృందాన్ని మరింత పటిష్టము చేసుకున్నారు. తెలుగులో ఈమె నటించిన చివరి చిత్రం “కుదిరితే కప్పు కాఫీ" సినిమా 2003లో పద్మశ్రీ పురస్కారం 2011లో నమ్మగ్రామం అనే తమిళ చిత్రంలో నటించి జాతీయ ఉత్తమ సహాయనటిగా పురస్కారం అందుకున్నారు. సుకుమారి ప్రముఖ సినీ దర్శకుడు బీమసింగ్ ను వివాహం చేసుకున్నారు.
ఆమె తన జీవితంలో చివరి శ్వాస వరకు (దాదాపు 60 ఏళ్లకు పైగా) కెమెరా ముందే గడిపారు. అందుకే ఆమెను దక్షిణ భారత చిత్రసీమ ఒక అరుదైన నటిగా, ఒక 'అమ్మ'లా గౌరవిస్తుంది.
సుకుమారి గారు 26 మార్చి 2013న చెన్నైలో మరణించారు. పూజా గదిలో దీపం వెలిగిస్తుండగా ప్రమాదవశాత్తూ ఆమె చీరకి అంటుకున్న అగ్ని ప్రమాదం వల్ల తీవ్ర గాయాల పాలై, చికిత్స పొందుతూ గుండెపోటుతో ఆమె కన్నుమూశారు
విశ్లేషణ. పొన్నూరి రాఘవేంద్ర
No comments yet. Be the first to comment!