🇮🇳 పద్మశ్రీ తోటతరణి – (సినీ కళా దర్శకుడు

తోట తరణి (Thota Tharani) భారతదేశానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు, ఆర్ట్ డైరెక్టర్ మరియు ప్రొడక్షన్ డిజైనర్. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ చిత్ర పరిశ్రమల్లో ఆయన తన ప్రత్యేకమైన సెట్టింగ్స్, పెయింటింగ్స్ మరియు కళా దర్శకత్వంతో గుర్తింపు పొందారు.

తరణి గారికి విశాలమై ఖాళీ స్థలం చూపించి అక్కడ "తాజ్మహల్" కావాలని అడిగారనుకోండి. చకచక సృష్టిం చేస్తారు. హుస్సేన్సాగర్ను కోరుకున్నారుకోండి. ఒక నీటి మడుగుకు రూపకల్పన చేస్తారు. మురికివాడ, పార్కు, పాత భవనాలు, అద్దాల మేడలు, విమానాశ్రయాలు, బస్ స్టేషన్, ఫ్లై ఓవర్, జంతు ప్రదర్శనశాల, ఇలా ఏది కావాలంటే దాన్ని సెట్ చేయడంలో ఆయన సిద్ధహస్తుడు. ప్రతిసృష్టి చేయగల ప్రతిభాశాలి. నలభై రెండేళ్లుగా అద్భుతాలు సృష్టిస్తున్న ఆ కళాదర్శకుడు పద్మశ్రీ తోటతరణి గారు “అర్జున్” సినిమా కోస ఏకంగా "మధుర మీనాక్షి ఆలయాన్నే" షూటింగ్ స్పాట్లో నిర్మించినవాడు. మన కాపు బిడ్డ.

ఆయన జన్మస్థలం మచిలీపట్నం (బందరు). ఎనిమిదిమంది సంతానాన్ని పోషించడం కోసం వారి నాన్నగారు చెన్నై చేరుకున్నారు. కృష్ణా, తరణి, హేమచందర్ (చిన్ని), చాందిని, యాదూజీ, యోగలక్ష్మి, పూజిత, భాను (భానుమూర్తి) వీరంతా ఆయన సంతానం. వారి నాన్నగారి పేరు తోట వెంకటేశ్వరరావు గారు. ఆయన స్టేజీ ఆర్టిస్టు. ఆడ వేషధారణలో నిపుణుడు. సినిమాల్లో వేషాలు వెతుక్కుంటూ మద్రాసు తరలి వచ్చారు.

మల్లేశ్వరి (ఎన్.టి.ఆర్) చిత్రానికి అసిస్టెంటు ఆర్టు డైరెక్టరుగా పనిచేశారు. జయసింహ, అమరదీపం, పాండురంగ మహాత్మ్యం, శంకరాభరణం, సిరిసిరి మువ్వ, తదితర సినిమాలకు తోట వెంకటేశ్వరరావు గారే కళా దర్శకులు. ఆర్ట్ డైరెక్టరుగా మంచి పేరు తెచ్చుకున్నారు. తరణిగారు చెప్పిన ఆయన జీవిత గాథ.

తరణి ఐదారు సంవత్సరాల వయస్సులో ఇంట్లో ఆడుకుంటూ ఓ మూల "బుద్ధుడు” బొమ్మ కనిపించింది. ఎందుకో తెలియదు గానీ దాని వంక అలాగే చూస్తుండిపోయాడు. కొంతసేపటి తర్వాత బుద్ధుడి బొమ్మ చేయాలనిపించింది. రెండు చాకీసులు తీసుకొని నేలపైన గీశాను అదంతా నాన్న గారు గమనించారు. వెంటనే రెండు డ్రాయింగ్ బుక్ కొనిచ్చారు. ఆ పుస్తకాలలోని బొమ్మలన్నీ చక చక గీసేశాను. కాగితం దొరికితే చాలు ఏదో ఒకటి అలా వేస్తూనే ఉండేవాడిని. బొమ్మలు గీయడానికి నాన్న నాకు రబ్బరు, స్కేలు యిచ్చేవారు కాదు. ఆయన మాత్రం ఉపయోగించేవారు. ఫర్ఫెక్షన్ కోసమే అలా చేశారని తర్వాత తెలిసింది. ప్రాథమిక విద్యాభ్యాసము చేసే రోజుల్లో ఓ టీచరు నన్ను బోర్డు మీద బొమ్మ వేయమన్నారు. బాగా వేయడంతో ఆయన ప్రశంసించడంతో పాటు పిల్లలందరికి చూపించి బొమ్మలు ఇలా వేయాలి అని చెప్పారు. నాకు ఎక్కడలేని సంతోషం కలిగింది.

నేను పుట్టింది, పెరిగింది చెన్నైలోనే, చదువు సరిగా సాగలేదు. ప్రైవేటుగా మెట్రిక్షన్ పరీక్ష వ్రాశాను. కానీ తప్పాను. నాన్న వెంట షూటింగులకు వెళ్తూండేవాడిని. ఓసారి సెట్లో ఎన్.టి.రామారావు గారు బాబూ ఏం చదువుతున్నావని అడిగారు. చెప్పాను. మళ్ళీ పరీక్షలు వ్రాయి. చదువుకుంటేనే భవిష్యత్తు అంటూ ప్రోత్సహించారు. మొత్తం మీద మెట్రిక్యులేషన్ పాసయి కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ చేరి పెయింటింగ్లో డిప్లొమో, పోస్టు గ్రాడ్యుయేషన్ చేశాను. అంతుకుముందే నాన్న గారితో కలిసి స్టూడియోలకు వెళ్లిన అనుభవం ఉండడంతో కళపై మంచి అవగాహన ఏర్పడింది. రాజస్థాన్ వెళ్ళి వాల్ పెయింటింగ్లో శిక్షణ పొందాను. పి.జి. పూర్తయ్యాక ముంబాయిలో ఒక అడ్వర్టయిజ్మెంటు కంపెనీలో ఉద్యోగం (ఆర్టిస్టు)లో చేరాను. సహ ఉద్యోగులు ఇతర కంపెనీల్లో పనిచేసే వాళ్లు నాలోని ప్రతిభను గుర్తించారు. వాళ్లందరూ కలిసి ఇక్కడుంటే నీ జీవితం "గొర్రె" తోకలాగుంటుంది. మద్రాసు వెళ్ళి పో ! నీవు క్యాలెండరు పెయింటింగ్ బాగా చేయగలవు. మేమంతా ఆర్డర్సు యిస్తాము. నాలుగు డబ్బులు సంపాదించుకోవచ్చును అని చెప్పారు. నేను కూడా ఆలోచించి మద్రాసు వచ్చాను.

మద్రాసు చేరుకున్నాక మళ్లీ నాన్నతో కలిసి స్టూడియోలకు వెళ్లడం, సెట్లు వేయడం మొదలుపెట్టాను. నాన్న సమయానికి ఉన్నా లేకున్నా. నా పని నేను చేసుకుపోయే వాడిని. అలా, అలా నా జీవితం ఎంతవరకు వచ్చిందో మీకు తెలుసు!

హేమచందర్, బాను, నాన్నగారి తోటి సినిమా రంగంలో ఉన్నారు. ఎన్నో సినిమాలకు ఆర్టు డైరెక్టర్లుగా పనిచేశారు.

అయితే నేను సెట్లు వేయడంలో వైవిద్యం చూపేందుకు ప్రయత్నించేవాడిని. కొంతమంది పెద్దలు నా పని తీరును గమనించి తొలిసారిగా "నాగమల్లి" సినిమాకు ఆర్ట్ డైరెక్టరుగా పనిచేసే అవకాశం కల్పించారు. అయితే దానికన్నా రెండవ సినిమా కమల్హాసన్ నటించిన "అమావాస్య చంద్రుడు” నాకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత "నాయకుడు" మౌనరాగం, దళపతి, బొంబాయి, రోజా, అంజలి వంటి చిత్రాలు మంచి బ్రేక్ యిచ్చాయి.

కమర్షియల్ చిత్రమైన నాయకుడు చిత్రానికి మొదటిసారిగా జాతీయ స్థాయిలో కళాదర్శకుడి అవార్డు అందుకున్నాను. అప్పటిదాకా కేవలం ఆర్టు సినిమాలకే పరిమితమైన ఈ అవార్డు కమర్షియల్ చిత్రాలనూ అక్కున చేర్చుకుంది. సినిమా విజయవంతం కావాలంటే రెండు కోణాల నుండి దర్శకుడు ఆలోచించాలి. కళాదర్శకుడు, ఫోటోగ్రాఫర్ ఇదోత్రికోణం. దర్శకుడు, ఎడిటర్, మ్యూజిక్ డైరెక్టరు ఇదో త్రికోణం. ఈ రెండు త్రికోణాలు కలిస్తే స్టార్ (నక్షత్రం) వస్తుంది. అదే సినిమా విజయానికి దోహదపడుతుంది. సినిమాలో కళా దర్శకుడి పాత్ర చిన్నదేం కాదు. తెరపై కనిపించే ప్రతిదృశ్యం వెనుక అతని కృషి ఉంటుంది.

నాకు తెలిసినంతవరకు సినిమా కథ విన్నవెంటనే స్కెచ్లు వేసే ఆర్టిస్టులు అరుదుగా ఉంటారు. నేను మాత్రం కథ వినగానే సన్నివేశాలకు తగ్గ స్కెచ్లు గీసుకుంటాను. ఆ తర్వాతే బాధ్యతలు చేపడతాను. దానికన్నా ముందు దర్శకుడి అభిరుచి ఎలా ఉంటుందో విశ్లేషించుకుంటాను. కెమెరా యాంగిల్స, లైటింగును దృష్టిలో పెట్టుకొని డిజైన్ స్కెచ్లు గీసుకొని సెట్స్కు శ్రీకారం చుడతాను. నా అభిప్రాయం ప్రకారం కళా దర్శకుడికి ఒళ్ళంతా కళ్లుండాలి. ప్రతి విషయాన్నిదృశ్యమానం చేసుకోగలిగే ఆలోచన ఉండాలి. నా మటుకు నేను దారిలో కనుపించే ప్రతి దృశ్యాన్ని మనస్సులో నిర్లిప్తం చేసుకుంటాను. పాతగోడలు, కొత్త భవనాలు, షాపింగ్ కాంప్లెక్స్, ప్రాథమిక పాఠశాల, ఆరోగ్యకేంద్రం ఇలా ఏ స్పాట్ ఎలా ఉంటుందో, క్షుణ్ణంగా పరిశీలిస్తాను.

సెట్ వేసినా సహజత్వము ఉట్టిపడేలా ఉండాలని పరితపిస్తాను. అందులో భాగంగానే నాకంటూ ప్రత్యేక గుర్తింపు లభించింది. సినిమా చిన్నదైనా, పెద్దదైనా దర్శకుడు సీనియరు అయినా క్రొత్తవాడయినా, ఒకే రకంగా పనిచేస్తాను. కె.విశ్వనాథ్ గారు తీసిన శంకరాభరణం, సిరిసిమువ్వ, సీతామహాలక్ష్మి సినిమాల కోసం ఎంత ఏకాగ్రతగా పనిచేశానో, మణిరత్నం, శంకర్ రూపొందించిన వైవిద్యభరిత, చిత్రాలకూ అంతే చిత్తశుద్ధితో కష్టపడ్డాను.

కాదల్ దేశం (తెలుగులో ప్రేమదేశం) కోస వేసిన భారీసెట్లు అప్పట్లో సంచలనం సృష్టించాయి. “నాయకన్" చిత్రం కోసం ముంబాయి వెళ్ళి వారం రోజులు పాటు నేటివిటీని పరిశీలించాను. కొన్ని వందల స్కెచ్లు గీసుకున్నాను. ముంబాయిలో జరిగిన అల్లర్లకు సంబంధించిన వాతావరణాన్ని సృష్టించడానికి అన్ని పత్రికల్లోనూ వచ్చిన వార్తల్ని కూలంకషంగా అధ్యయనం చేశాను. వాటి ఆధారంగానే సెట్లు వేశాను. దానికి రెండవసారి జాతీయ అవార్డు లభించింది. అంజలి సినిమా కోసం ఒక రోడ్డు మీద అపార్టుమెంటు సెట్ వేస్తున్నాము. ఓ రోజు రాత్రి ఓ లారి సెట్సుకు మెటీరియల్ తీసుకు వస్తుంది. దాని వెనుకే ఓ కారు వారు దారి దప్పి లారీ వెనుక వచ్చేశారు. కొంతదూరము రాగానే రోడ్డు మూసుకుపోవడంతో కారులో వాళ్ళు ఆలోచనలో పడ్డారు. కిందికి దిగి మా సెట్వైపు చూస్తూ ఇంతకుముందు ఇక్కడ అపార్టుమెంటు లేదే! అనుకుంటూ అసలు విషయము గ్రహించి నివ్వెరపోయారు. వాళ్లను అంతగా బ్రమింపచేయగలిగినందుకు నాకు ఓ ప్రక్క ఆశ్చర్యము, మరోప్రక్క ఆనందం కలిగింది.

ఇటీవలి కాలంలో నాకు బాగా పేరు తెచ్చిన సెట్టింగ్ అర్జున్ సినిమాలోని మీనాక్షి దేవాలయం. దర్శకుడు కథ చెప్పినపుడే నా మనస్సులోని నిర్దిష్టమైన ఊహా చిత్రం రూపుదిద్దుకుంది. ఒక ప్రఖ్యాత ఆలయానికి ప్రతిసృష్టి చేయడం ఏమంత చిన్న విషయం కాదు. గుడిలోని ప్రతి అణువునూ మూడో కంటితో పరిశీలించాలి. ఆ సెట్ వెయ్యాల్సి రావడం అరుదైన అవకాశంగా భావించాను. సద్వినియోగం చేసుకోవాలనుకున్నాను. ఆ గుడికి వెళ్లి మూడు గంటలు గడిపాను. ఉద్వేగం ఆపుకోలేక అక్కడే వరండాలో స్కెచ్ గీయడం మొదలుపెట్టాను. నిర్వాహకులు అభ్యంతరం చెప్పారు. దాంతో కొన్ని ఫోటోలు తీసుకున్నాను. సెట్ ఎలా వేయాలో అక్కడే మనస్సులో ఓ ప్రణాళిక రూపొందించుకున్నాను. చెన్నైకి రాగానే బోలిడన్ని స్కెచ్లు వేశాను. రెండు మూడొందల ఫోటోలను అనేకసార్లు పరిశీలించాను. వాటి సాయముతోనే గోడలకూ, వీధులకూ, రూపకల్పన చేశాను. దీనికి జాతీయ అవార్డు వస్తుందని ఆశించాను. బహుశా కమిటీలోని వాళ్లు అది నిజమైన దేవాలయమే అనుకొని ఉంటారు. అయితే నంది అవార్డు రావడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నన్ను గుర్తించింది. నాకు నంది అవార్డు రావడం ఇది మూడవసారి. ఈ క్రెడిట్ ప్రధానంగా నిర్మాతలకే దక్కుతుంది.

నా కళా దర్శకత్వములో నన్ను నేను ఇన్స్పైర్ చేసుకున్న సినిమాలలో "చంద్రముఖి"ని చెప్పుకోవచ్చును. అందులో ఒకే భవనములో విభిన్న పార్శ్వాలను సృష్టించాము. దానికి సహకరించిన దర్శకుడు పి. వాసుగారిని ఎప్పటికీ మరిచిపోలేను.

నేను కళాదర్శకత్వం వహించిన సినిమాలను చూడను. అది విచిత్రంగా అనిపించినా అది నిజం. అంజలి, నాయకుడు, చంద్రముఖి, ప్రేమికుడు, ఒకే ఒక్కడు, జీన్స్, గీతాంజలి, భారతీయుడు చూడాలని ఉంది. అర్జున్ వంటి చిత్రాలు పూర్తయ్యాక ఇంతవరకూ చూడలేదు. ఒకే ఒక్కడు, నాయకుడు సినిమాలకు కాస్ట్యూమ్స్ కూడా డిజైన్ చేశాను. అయితే నిర్మాతలు ఎక్కువగా ముంబాయి డిజైనర్లునే ఇష్టపడుతుండడంతో ఆ శాఖ మీద ఆసక్తి చూపలేదు.

నేను భారీ చిత్రాలకు మాత్రమే పనిచేసే “కాస్ట్" కళాదర్శకుడినని అనుకుంటారు చాలామంది. అది నిజం కాదు. బడ్జెట్ను దృష్టిలో పెట్టుకొని సెట్లు రూపొందిస్తాను. వీలయినంత పొదుపుగా వ్యవహరిస్తాను. అందుకోసం కొత్త కొత్త పద్ధతులను అవలంబిస్తాను.

బీహారీ ఆర్ట్ డైరెక్టరు హిందీలో తీసిన "పాకీజా” నన్ను బాగా ఆకట్టుకొన్న సినిమా. ప్రపంచ ప్రఖ్యాత జపాన్ దర్శకుడు "అకిరాకురసవా” సినిమాల్లోనే కళా వైభవము ఎంత ముచ్చట గొలుపుతుంది. అలాగే "విజార్డ్ ఆఫ్ వార్స్" కళా దర్శకత్వ ప్రతిభ నన్ను మంత్రముగ్ధులను చేసింది.

నాకు బాధ కలిగించే అంశం ఎంతో కష్టపడి వేసిన సెట్సును కూల్చివేయడం. ఒక వ్యక్తి సృష్టించిన ప్రపంచం అతని కళ్లముందే కూల్చివేయడం అనేది బాధగా ఉంది.

ఈవిధంగా అతనితో భావాలు, ఆయన జీవిత అనుభవాలు చెప్పుకొచ్చారు. ఆయనకు భారత ప్రభుత్వము దేశములోనే అత్యున్నత పురస్కారాలో ఒకటైన “పద్మశ్రీ” అవార్డులతో గౌరవించింది.

గుణశేఖర్ దర్శకత్వములో అనుష్కశెట్టి హీరోయిన్ రాణి రుద్రమదేవి సినిమాకు "కాకతీయ కళావైభవము" సెట్స్ వేశారు. సినిమా రిలీజయి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించింది.

ప్రసిద్ధ సినిమాలు

ఆయన కెరీర్‌లో ప్రత్యేకంగా గుర్తుండిపోయే చిత్రాల్లో:

Nayakan

Indian

Thalapathi

Roja

Kadhalan

Sivaji

Dasavatharam

Arjun

Kanthaswamy

Ponniyin Selvan

 వంటి చిత్రాలు ఉన్నాయి 

🏅జాతీయ అవార్డులు

తోట తరణి రెండు National Film Awards for Best Art Direction అందుకున్నారు:

1987 – Nayakan

1996 – Indian

🏅నంది అవార్డులు

తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా ఆయనకు విశేష గుర్తింపు లభించింది. Best Art Director విభాగంలో నంది అవార్డులు పొందారు:

🌟 Sagara Sangamam

🌟 Geethanjali

🌟 Arjun

 🇮🇳 పద్మశ్రీ

భారత ప్రభుత్వం ఆయన కళారంగ సేవలను గుర్తించి 2001లో “పద్మశ్రీ” పురస్కారంతో సత్కరించింది

సినిమాలకు మాత్రమే పరిమితం కాని కళాకారుడు

తోట తరణి కేవలం సినిమా ఆర్ట్ డైరెక్టర్ మాత్రమే కాదు. ఆయన:

పెయింటింగ్స్

పెన్సిల్ డ్రాయింగ్స్

వాటర్ కలర్స్

ఇంక్ డ్రాయింగ్స్

Collages

Montages

Sculptures

Murals

Calligraphy

వంటి అనేక కళారూపాల్లో పనిచేశారు. ఆయన దేశ, విదేశాల్లో అనేక కళా ప్రదర్శనలు కూడా నిర్వహించారు.

తోట తరణి ప్రత్యేకత

ఆయన కళలో ముఖ్యమైన ప్రత్యేకత భావాన్ని, కథను సెట్స్ ద్వారా చూపించడం. సినిమా కథకు అనుగుణంగా చారిత్రక ప్రదేశాలు, నగరాలు, రాజభవనాలు, దేవాలయాలు లేదా సామాన్య ప్రజల జీవన వాతావరణాన్ని సెట్ల రూపంలో సృష్టించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది.

మొత్తంగా, తండ్రి నుంచి వచ్చిన కళా వాతావరణాన్ని ఆధారంగా చేసుకుని, చిత్రలేఖనం నుంచి సినిమా ఆర్ట్ డైరెక్షన్ వరకు విస్తరించిన సుదీర్ఘ ప్రయాణంలో జాతీయ అవార్డులు, నంది అవార్డులు మరియు 2001 పద్మశ్రీ వంటి గౌరవాలను అందుకున్న ప్రముఖ భారతీయ కళాకారుడు తోట తరణి.

పొన్నూరి రాఘవేంద్ర