పద్మభూషణ్ ధ్యాన్ చంద్ (హాకీ క్రీడాకారుడు)

 Padmabhushan Major Dhyan chand ( Hockey Player )

పద్మభూషణ్ ధ్యాన్ చంద్ (హాకీ క్రీడాకారుడు)

మేజర్ ధ్యాన్ చంద్ (29 ఆగస్టు 1905 – 3 డిసెంబర్ 1979) హాకీ క్రీడా చరిత్రలో ప్రపంచ అత్యున్నత మరియు అసాధారణ ఆటగాడిగా గుర్తింపు పొందిన గొప్ప భారతీయ ఫీల్డ్ హాకీ క్రీడాకారుడు

జననం, మరణం: ఆయన ఆగస్టు 29, 1905న అలహాబాద్‌లో జన్మించారు. డిసెంబర్ 3, 1979న ఢిల్లీలో కన్నుమూశారు.

హాకీ మాంత్రికుడు (The Wizard): బంతిపై ఆయనకున్న అద్భుతమైన నియంత్రణ (Ball Control) కారణంగా ప్రపంచం ఆయన్ను 'హాకీ మాంత్రికుడు' లేదా 'విజార్డ్' అని పిలిచింది.

ఒలింపిక్ స్వర్ణ పతకాలు: భారతదేశానికి హాకీలో స్వర్ణయుగంగా పరిగణించే కాలంలో 1928 (ఆమ్‌స్టర్‌డామ్), 1932 (లాస్ ఏంజెల్స్), 1936 (బెర్లిన్) ఒలింపిక్ క్రీడలలో వరుసగా మూడు బంగారు పతకాలను సాధించిపెట్టారు.

గోల్స్ రికార్డ్: 

తన అంతర్జాతీయ కెరీర్‌లో 400లకు పైగా గోల్స్, అలాగే తన మొత్తం కెరీర్‌లో 1000కి పైగా గోల్స్ సాధించారు.

జాతీయ క్రీడా దినోత్సవం:

 ఆయన జన్మదినమైన ఆగస్టు 29వ తేదీని భారతదేశంలో జాతీయ క్రీడా దినోత్సవంగా (National Sports Day) నిర్వహిస్తారు.గౌరవాలు: భారత ప్రభుత్వం ఆయనను 1956లో దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్‌తో సత్కరించింది. భారతదేశంలో అత్యున్నత క్రీడా పురస్కారమైన 'మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు' ఆయన పేరు మీదనే కొనసాగుతోంది.

ఇండియా హాకీ ప్లేయర్ “ధ్యాన్ చంద్” (ధ్యాన్సింగ్) తండ్రి సామేశ్వర్ దత్ సింగ్ తల్లి శారదాసింగ్ (రూప్సింగ్, మూల్సింగ్) సోదరులు, స్వగ్రామము “ఝూన్సీ” ఉత్తరప్రదేశ్, 29-8-1905 సంవత్సరంలో అలహాబాద్, ప్రయాగరాజ్లో రాజపుత్ర (కాపు క్షత్రియ) బయాస్ కుటుంబంలో న్మించాడు. 1921లో భారత సైన్యములో చేరి 1956 వరకు మేజర్గా ఉన్నారు. 1926 లో హాకీ ప్లేయర్ ఒలింపిక్ లో పాల్గొన్నారు. టీమ్ కెప్టెన్గా 1928 ఆంస్టర్ డ్యామ్లోనూ, 1932లో లాస్ఏంజిల్స్లోనూ, 1936 బెర్లిన్లోనూ బంగారు పతకాలు సాధించారు. ఆయనను సూపర్ బాల్ కంట్రోల్ మేజర్గా అభిమానులు పిలిచేవారు.

ధ్యాన్సింగ్ గారు రాత్రులు వెన్నెలలో గూడా ఆడేవారు. అందుకని ఆయనను ధ్యాన్ చంద్ (చంద్రుడు) గా పిలిచారు. ఆయన “వంట, వేట, బిలియర్డ్స్ గేమ్, క్యారమ్స్ ఆడేవారు. ఆయన ప్రతిష్టాత్మకమైన, పద్మశ్రీ, పద్మభూషణ్, అందుకున్నారు. కేంద్రప్రభుత్వము 2021 సంవత్సరం "ఖేల్రత్న ధ్యాన్చంద్ అవార్డు" ఏర్పాటు చేసింది. క్రీడా శాఖ భారత్ కు స్వర్ణాభిషేకం చేసిన ధ్యాన్ చందు కు భారతరత్న ఇవ్వాలని సూచించినందుకు కుమారుడు అశోక్ కుమార్ సంతోషించాడు.

హిట్లర్ ఆఫర్్న తిరస్కరించారు:

 సుమారు 40 వేల మంది ప్రేక్షకుల మధ్య బెర్లిన్ ఒలింపిక్స్ హాకీ ఫైనల్ జరిగింది. జర్మన్ అధ్యక్షుడు "అడాల్ఫ్ హిట్లర్” జోసఫ్ గోబెల్స్, హెర్మాన్ జియోరింగ్, జోకిమ్ రాబెన్హాప్ వంటి ప్రముఖులు ఈ మ్యాచ్కు హాజరయ్యారు. “హిట్లరే” స్వర్ణపతకాలు అందిచాల్సి ఉంది. అయితే తమ జట్టు ఓటమిని జీర్ణించుకోకపోయిన హిట్లర్ బహుమతుల ప్రదానము చేయకుండానే వెనుదిరిగాడు. ఆ తర్వాత రోజు హిట్లర్ను కలవాల్సిందిగా “ధ్యాన్చంద్"కు కబురు పంపాడు. ఉదయాన్నే వెళ్ళిన ధ్యాన్చంద్ హిట్లర్ ప్రత్యేకంగా మాట్లాడాడు. " భారత్ లో మీరేమి చేస్తారని ప్రశ్నించాడు" భారత ఆర్మీలో సైనికుడిగా పనిచేస్తాను" అని ధ్యానంద్ బదులిచ్చాడు. మా దేశానికి వచ్చేయ్, జర్మన్ ఆర్మీలో మంచి హోదా కల్పిస్తా ! అంటూ హిట్లర్ ప్రతిపాదించాడు. వేరొకరైతే "హిట్లర్" మాటకు ఎదురు చెప్పేవారు కాదు. ఎందుకంటే అతను నియంత. అతనంటే అందరికీ భయం, కానీ ఈ ఆఫర్ను ధ్యాన్చంద్ సున్నితంగా తిరస్కరించాడు. తన కుటుంబమంతా భారతదేశంలో స్థిరపడిపపోయింది. కాబట్టి ఇదంతా కుదిరేపని కాదని చెప్పాడు. దీంతో ఆ సమావేశం ముగిసింది.

నిజంగా మాంత్రికుడే : ధ్యానంద్ హాకీ స్టిక్ అందుకున్నాడంటే ప్రత్యర్థి జట్టు ఆటగాళ్ళు కూడా ప్రేక్షకుల్లా మారిపోతారు. అతని చేతిలో హాకీస్టిక్ ఓ మంత్రదండాన్ని

తలపిస్తుంది. అతనికి బంతి అందిందా గోల్ ఖాయమే ! అతని హాకీస్టిక్ ఏదో మాయుందని దాన్ని మార్చివేరేది ఇచ్చినా గోల్స్ వరము ఆగేది కాదు. జర్మనీ నియంత “అడాల్ఫ్ హిట్లర్ మొదలుకొని ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం "డాన్ బ్రాడ్మెన్” వరకూ అతని ఆట తీరుకు మైమరచినవారే ! భారత్ లోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఇంత పేరు ప్రఖ్యాతులు అందుకున్న హాకీ ఆటగాడు మరొకరు లేరంటే అతిశయోక్తి కాదేమో! ఇప్పుడంటే భారత హాకీ జట్టు ఒలింపిక్స్కు అర్హత సాధించేందుకు ఆపసోపాలు పడుతోంది. కానీ స్వాతంత్రం రాకముందు మన జట్టుది స్వర్ణయుగమే 1928 (అమ్స్టర్డ్యామ్) 1932 (లాస్ ఏంజల్స్) 1936 (బెర్లిన్) ఇలా భారత్ వరుసగా మూడుసార్లు ఒలింపిక్ ఛాంపియన్ గా నిలిచింది. భారత్ కు ఈ మూడు విజయాలు అందాయంటే ఇది ధ్యాన్చంద్ ఘనతే. ఈ హాకీ యోధుడు తొలుత ఆర్మీలో నిర్వహించే టోర్నమెంటులో సత్తా చాటాడు. అనంతరం 1926లో భారత్ తో తొలిసారిగా అంతర్జాతీయ టోర్నీ ఆడేందుకు న్యూజిలాండ్లో పర్యటించింది. ఈ టోర్నీ ధ్యానంద్ క్రీడా జీవితాన్నే మలుపు తిప్పింది. తొలిసారి ఒలింపిక్ బరిలోకి దిగిన భారత హాకీ జట్టు స్వర్ణంతో మెరిసింది. 1932 లాస్ ఏంజల్స్లో ఫైనల్లో భారత్ 24-1తో యు.ఎస్.ఎ ను చిత్తుగా ఓడించింది. ఇది ప్రపంచ రికార్డు. 1936 బెర్లిన్లోను ఫైనల్లో 8-1తో 'జర్మనీ'ని మట్టి కరిపించింది. 1935లో ఆస్ట్రేలియా పర్యటించినపుడు ఆ మ్యాచ్ చూసేందుకు దిగ్గజ బ్యాట్స్మెన్ "బ్రాడ్మన్ అక్కడికొచ్చాడు. ఆ మ్యాచ్లో భారత్ 10-1తో నెగ్గింది. అనంతరం బ్రాడ్మన్ భారత జట్టును కలిసి ధ్యాన్చందో ఫోటో దిగి మెమెంటోను బహూకరించాడు. ఆ రోజు సాయంత్రం క్రికెట్ మైదానంతో హాకీ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో బ్రాడ్మెన్ కూడా ఆడాడు. ధ్యానంద్ ఆట తీరుకు ముగ్ధుడైన బ్రాడ్మన్ "క్రికెట్లో పరుగులు సాధించినంత సులువుగా గోల్స్ కొడుతున్నావు అంటూ ప్రశంసించాడు. బెర్లిన్ ఒలింపిక్స్లో లో భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరించడం బ్రాడ్మన్ను కలుసుకోవడం తన జీవితంలో మధుర క్షణాలని ధ్యానంద్ ప్రస్తావించాడు. ధ్యాన్చంద్ 3-12-1979న స్వర్గస్థులైనారు.

🎖️ కేంద్ర ప్రభుత్వం అందించిన గౌరవాలు 

జాతీయ క్రీడా దినోత్సవం: మేజర్ ధ్యాన్ చంద్ పుట్టినరోజు అయిన ఆగస్టు 29వ తేదీని కేంద్ర ప్రభుత్వం భారతదేశ "జాతీయ క్రీడా దినోత్సవం" (National Sports Day) గా ప్రకటించింది.ఖేల్ రత్న అవార్డు పేరు మార్పు: భారతదేశ అత్యున్నత క్రీడా పురస్కారమైన రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పేరును కేంద్ర ప్రభుత్వం "మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు" గా మార్చింది.ధ్యాన్ చంద్ అవార్డు: క్రీడల్లో జీవితకాల సాధన (Lifetime Achievement) చేసిన వారికి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా "ధ్యాన్ చంద్ అవార్డు" అందజేస్తుంది.ఢిల్లీ జాతీయ స్టేడియం: ఢిల్లీలోని ప్రసిద్ధ నేషనల్ స్టేడియంకు ఆయన గౌరవార్థం "మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ stadium" అని పేరు పెట్టారు.

ఒలింపిక్స్‌లో పాల్గొన్న సంవత్సరాలు & కెప్టెన్సీ:ధ్యాన్ చంద్ గారు 1926లో అంతర్జాతీయ హాకీలోకి అడుగుపెట్టారు (న్యూజిలాండ్ పర్యటన). కానీ ఆయన పాల్గొన్న మొదటి ఒలింపిక్స్ 1928 (ఆమ్‌స్టర్‌డామ్).ఆయన 1936 బెర్లిన్ ఒలింపిక్స్‌లో మాత్రమే భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. 1928, 1932 ఒలింపిక్స్‌లో ఆయన ఆటగాడిగా బంగారు పతకాలు సాధించడంలో కీలక పాత్ర పోషించారు.

పౌర పురస్కారాలు:భారత ప్రభుత్వం ఆయనకు 1956లో "పద్మభూషణ్" పురస్కారాన్ని అందించింది

 రచయిత  - భట్టరుశెట్టి పద్మారావు రాయలు