🇮🇳 మత్స్ సంతోషి ( వెయిట్ లిఫ్టర్)
🇮🇳 మత్స్ సంతోషి ( వెయిట్ లిఫ్టర్)
Admin
Author🏋️ మత్స్య సంతోషి( వెయిట్ లిఫ్టింగ్)
Matsa సంతోషి (Weight Lifting)
🏋️ మత్స్య సంతోషి – వెయిట్‌లిఫ్టింగ్
పేరు: మత్స్య సంతోషి / Matsa Santoshi
క్రీడ: వెయిట్‌లిఫ్టింగ్
విభాగం: మహిళల 55 కిలోల విభాగం
2019 Commonwealth Senior Weightlifting Championships: మహిళల 55 కిలోల విభాగంలో రజత పతకం సాధించిన భారత క్రీడాకారిణిగా నివేదికల్లో నమోదైంది పోటీలో Soroikhaibam Bindyarani Devi స్వర్ణం సాధించినట్లు నమోదైంది.
అంతర్జాతీయ యవనికపై భారత జెండాను రెపరెపలాడిస్తున్న వెయిట్రిఫ్టర్ ఉత్తరాంధ్ర కాపు తేజం మన మత్స్య సంతోషి 2015 సెప్టెంబరులో పూణెలో జరిగిన అంతర్జాతీయ కామన్ ఛాంపియన్ షిప్ లో బంగారు పథకాన్ని సాధించి మరోసారి ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. వెయిట్ లిఫ్టింగ్లో ఇప్పటివరకు ఇంటర్నేషనల్ టోర్నమెంటులో పాల్గొని 8 సార్లు మోడల్స్ సాధించిన సంతోషి నిజంగా మట్టిలో మాణిక్యమే దేశం మొత్తం మీద ఈ విభాగములో పోటి పడుతోంది. ఒక్క మత్స్య సంతోషి మాత్రమే కావడం విశేషం.
విజయనగరం జిల్లా కొండ వెలగాడ అనే గ్రామములో మార్చి 10 తేది 1994లో నిరుపేద కాపు కుటుంబములో మత్ససంతోషి జన్మించినది. తండ్రి జూట్ మిల్లు కార్మికుడు. తల్లి గృహిణి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు నలుగురు సంతానంలో ఆఖరు సంతానం, మత్స సంతోషి ప్రాథమిక పాఠశాల చదువు మాత్రమే చదువుకున్న సంతోషి వెయిట్ లిఫ్టింగ్ నేర్చుకొనుటకు ఎన్నో కష్టనష్టాలకు గురయింది. సాధన చేయడానికి సరైన ప్రదేశము లేకపోవుటచే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంది. ఇరుకైన గుడిసెలో సాధన చేసి తనదైన శైలిలో పథకాన్ని సాధించి త్రివర్ణ పతకాన్ని అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడించింది. ఇప్పటివరకు జాతీయ స్థాయిలో లెక్కకు మించిన పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది. పతకాలతో పాటు ప్రశంసాపత్రాలను కూడా అందుకుంది. సంతోషికి " గోల్డ్ మెడల్" లభించడంతో ఆమె కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఆమె తల్లి ఎన్నో కష్టాలు పడి సాధించిందని కామన్వెల్త్ మెడల్ సాధించిన సంతోషికి ప్రభుత్వం అండగా నిలిచి ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం యివ్వాలని కోరింది. ఈ మెడల్ ఇంప్రూవ్ కావడంతో ఇదే స్ఫూర్తితో ముందడగు వేస్తానని మరిన్ని పోటీలలో విజేతగా నిలిచి భారత్ పతకాన్ని అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడిస్తానని ధీమా వ్యక్తం చేశారు. సంతోషిని ఆదర్శంగా తీసుకొని ఆ గ్రామంలో ఉన్న విద్యార్థి విద్యార్థినులు క్రీడల పట్ల ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. ఆమె లాంటి క్రీడాకారులు చాలా గ్రామములలో ప్రోత్సాహం లేక మరుగున పడిపోతున్నారు. ప్రభుత్వాలు ఇకనైనా ముందుచూపుతో మట్టిలో మాణిక్యాలను వెలికితీసి అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా శిక్షణ యివ్వాలని కోరుతున్నారు.
11 సం!! వయసులో ఏదైనా "గేమ్” నేర్చుకోవాలని తన మాస్టరు వెయిట్ లిఫ్టింగ్ గురించి చెప్పాడు. మొదట్లో వెయిట్ లిఫ్టింగ్ అంటే బరువులు ఎత్తడమని కూడా తెలియదు. తల్లిదండ్రులు మనకంత ఆర్థిక స్తోమత లేదన్నారు. పట్టుదలతో ముందడుగు వేసి మెల్లగా ప్రాక్టీసు చేసి ఈ గేమ్ మీద ఆసక్తి పెంచుకొని శ్రద్ధ పట్టుదలతో రాణించడం మొదలు పెట్టారు.
2006 నుండి 2007 వరకు జాతీయ చాంపియన్ లిస్టులో ఎన్నో పథకాలు గెలిచింది. 2009 గత ఏడాది జరిగిన జాతీయ క్రీడలో మూడు స్వర్ణ పథకాలు సాధించింది. 2019 ఎషియాడ్లో స్వర్ణపథకం సింగపూర్లో జరిగిన యూత్ ఒలంపిక్స్ ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ లో మెడల్స్ గెలుచుకుంది. ఇప్పటివరకు ఫారిస్, చైనా, సింగపూర్, సౌతాఫ్రికా, తాయిలాండ్, గ్లాస్కో మలేషియా, బల్గేరియా, తదితర దేశాల్లో 15 అంతర్జాతీయ పోటీలో పాల్గొన్న సంతోషి. నాలుగు బంగారు పతకాలు, రెండు రజిత పథకాలు, 2 కాంస్య పతకాలు గెలుచుకున్నారు. అభినవ భీముడుగా ప్రసిద్ధి చెందిన పెద్దిలక్ష్మి నారాయణ వద్ద అవసరమైన సలహాలు సూచనలు తీసుకొని, ముందుకు వెళు తున్నానని తెలిపింది. సంతోషి విజయం, గ్రామానికి, జిల్లాకు, రాష్ట్రానికి ఎంతో గర్వకారణమని మంత్రి కిమిడి మృణాళిణి అన్నారు. ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. కేంద్రమంత్రి అశోక గజపతి గజపతిరాజు చేతులమీదుగా అవార్డు అందుకుంది.
బట్టరుశెట్టి పద్మారావు రాయలు
No comments yet. Be the first to comment!