నిశ్చంకర రవికుమార్ (బాడీ బిల్డర్ )
నిశ్చంకర రవికుమార్ (బాడీ బిల్డర్ )
Admin
Author
నిశ్చంకర రవికుమార్ (బాడీ బిల్డర్ )
Nissankara Ravi Kumar ( Body Builder )
క్రీడాకారుడు: నిస్సంకరరావు రవికుమార్, ఒక ప్రముఖ అంతర్జాతీయ బాడీబిల్డర్.సాధించిన విజయాలు: ఆయన పలుమార్లు ప్రతిష్టాత్మక "మిస్టర్ ఆంధ్రా" టైటిల్ను మరియు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులను గెలుచుకున్నారు.
కోచ్: ఆయన జి. శ్రీనివాసరావు గారి శిక్షణలో రాణించారు.
నేపథ్యం: గుంటూరు సమీపంలోని ఏటూరుకు చెందిన రవికుమార్ ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నారు
నిశ్చంకర రవికుమార్ (బాడీ బిల్డర్)
ఆధునిక జీవితంలో వ్యాయామం తప్పనిసరిగా మారిపోయింది. ఒత్తిడి నుండి ఉపశమనం పొందేందుకు అత్యధికులు దేహ దారుఢ్యతకు ప్రాధాన్యమిస్తున్నారు. కసరత్తులతో కండరాల ఆరోగ్యాన్ని పెంచుకుంటూ అంతర్జాతీయ దేహదారుఢ్య (బాడీబిల్డింగ్) పోటీల్లో రాణిస్తూ గ్రామీణ ప్రతిభను చాటే ప్రయత్నం చేస్తున్నారు. మన బలిజకాపు బిడ్డ నిశ్చంకర రవి కుమార్.
ఈ గుంటూరు క్రీడాకారుడు నిత్యం కసరత్తులు, ఆహార పద్ధతుల నియంత్రణతో దేహాన్ని మహాబలంగా మార్చేసి సంబంధిత దేహదారుఢ్య పోటీలలో ప్రపంచస్థాయి సత్తా చాటడానికి మునికాళ్లపై నిలుస్తూ భారత కీర్తి పతాకం ఎగురవేయడమే లక్ష్యంగా కఠోరంగా శ్రమిస్తున్నాడు.
ఈ ఘనత సాధించిన మొట్ట మొదటి తెలగబిడ్డ నిశ్చంకర రవికుమార్ గతంలో ఈ పోటీలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి అనేకమంది ఈ పోటీలకు వెళ్లి అర్హత సాధించినప్పటికి స్వర్ణ పతకంతో ఎవరూ గెలువలేదు. దీంతో రవికుమార్ ఈఘనత సాధించిన మొట్టమొదటి తెలుగుబిడ్డగా నిలిచి పోయారు. పేదకుటుంబంలో జన్మించిన రవికుమార్ చిన్నతనం నుండి కండరాలతో దేహాన్ని పెంచుకోవాలనే తపనతో రగిలిపోయేవాడు. అప్పుడు రవి దేహాన్ని చూసి కొంతమంది నవ్వారు. అది అతని మనస్సులో నాటుకుపోయింది. తన కోచ్ జి. శ్రీనివాసరావు కొన్ని సూచనలు చేయడంతో రవి జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ఇక అప్పటినుండి రెండు, మూడు, నాలుగు గంటలైంది. “మిస్టర్ ఆంధ్ర” టైటిల్ సొంతం అయ్యింది. రవికుమార్ 75 కేజీల విభాగంలో ఇండియాలోనే బెస్ట్ గా కొనసాగుతున్నాడు. ఎన్నో అవార్డులు తీసుకున్నాడు.
దేశ విదేశాల్లో జరిగే బాడి బిల్డింగ్ పోటీల్లో ప్రపంచ బాడీ బిల్డింగ్ ఛాంపియన్ షిప్ గెలిచే సత్తా ఉంది. కానీ తోడు నిలిచే సాయం కావాలి. విశ్వపతకంపైనే ఆయన గురి. కండ ఉంది. సాయం చేసే గుండె కావాలి. చిత్తూరు జిల్లా నిశ్చకదుర్గ పాలకుల కుటుంబీకులు.
భట్టరుశెట్టి పద్మారావు రాయలు
No comments yet. Be the first to comment!