డా॥ చాట్ల శ్రీరాములు (నాటక రంగ గురువు)

Dr. Chatla Sriramulu 

జననం: 5 డిసెంబర్ 1931, విజయవాడ.

తొలినాళ్లలో రైల్వేలో పనిచేసి, అనంతరం నాటక రంగంపై పూర్తి దృష్టి పెట్టారు. 

100కు పైగా నాటకాల్లో నటించి, అనేక నాటకాలకు దర్శకత్వం వహించారు. 

నటన, దర్శకత్వంలో అనేకమంది కళాకారులకు శిక్షణ ఇచ్చిన ప్రముఖ నాటక రంగ గురువుగా గుర్తింపు పొందారు. నటులు నాగార్జున, వెంకటేష్ తదితరులకు నటనలో శిక్షణ ఇచ్చినట్లు ఆధారాలు ఉన్నాయి. 

‘మరో మొహంజోదారో’ ఆయన ప్రసిద్ధ నాటకాల్లో ఒకటి. 

తెలుగు నాటక రంగ అభివృద్ధికి రసరంజని సంస్థ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. 

1982లో కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు అందుకున్నారు. అలాగే ఎన్.టి.ఆర్. అవార్డు, పొట్టి శ్రీరాములు తెలుగు

 విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ వంటి గౌరవాలు పొందారు. 

మరణం: 18 డిసెంబర్ 2015, 84 సంవత్సరాల వయసులో. 

చాట్ల శ్రీరాములు గారు తే|5-12-1931 సం॥ అచ్చమ్మ, అచ్చయ్య దంపతులకు తెలగ కుటుంబంలో పెద్ద కుమారుడుగా జన్మించాడు. విజయవాడ రైస్ కాలువ ఒడ్డున చిన్న గుడిసెలో నివసిస్తూ సమీప గ్రామాల నుండి తాటాకుల బండ్లు వస్తే కొని వాటిని అమ్మడం జీవనాధారం. వారి నాన్నగారు అమ్మేవారు. ఆయన పదవ తరగతి చదువుతుండేటప్పుడు ఊహ తెలియని వయస్సు. పదమూడవ ఏటనే మేనత్త కుమార్తెతో వివాహం జరిగింది. తండ్రి అచ్చయ్యగారు తన కొడుకు లండన్ వెళ్ళి చదువుకుంటాడనేవాడు. శ్రీరాములు కాలేజీలో చేరాడు. 1951లో మొదటిసారి ప్రముఖ హాస్యనటులు పొట్టి ప్రసాద్ “పెళ్ళిచూపులు" నాటికను కాలేజీ వైజ్ఞానిక సభలు" లో ప్రదర్శించారు. అది చూసిన పెద్దలు గరికపాటి రాజారావు, కత్తి వెంకటేశ్వరరావు గార్లు అభినందించారు. వెంకటేశ్వరరావు దర్శకత్వంలో “మాస్టర్జీ” నాటకం వైజాగ్ అంతర్ కళాశాల పోటీలో ప్రదర్శించగా శ్రీరాములు గారికి స్వర్ణ పథకాన్ని అందించడమే గాకుండా ఒకరోజు కాలేజీకి సెలవు ప్రకటించారు. ఆయన డిగ్రీ చదివేటప్పటికి ఆయనకు ఇద్దరు పిల్లలు పుట్టారు. ఆర్థిక పరిస్థితి సరిలేక ప్రైవేటు కంపెనీలో టైపిస్టుగా పనిచేసేవారు. నెలకు ముప్పయి రూపాయలు. డిగ్రీ పూర్తయ్యాక, రైల్వేలో టికెట్ కలెక్టరుగా ఉద్యోగం వచ్చింది. అప్పుడు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కొంత పైకం పంపేవాడు. సంవత్సరానికి ఆరునెలలు నాటకాలు కోసమే సెలవుపెట్టి, ఆదివారాలు ఓవర్డ్యూటీ చేసేవారు. 1956లో రైల్వే టి.సిగా చేరి రైల్వే అనౌన్స్మెంటు చేసే డ్యూటీ ఇచ్చారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉద్యోగిగా చేరారు. ఆయన నాటకాలు ఎక్కడ ప్రదర్శించినా మంచిపేరు రావడంతో ఎక్కువ సమయం నాటకానికి కేటాయించాల్సి రావడంతో ఉద్యోగం వదలి తెలుగు నాటక రంగానికి అంకితమయ్యారు. ఆయన ఆర్థికంగా ఎన్నో కష్టాలనెదుర్కొన్నాడు. నాటకు ఆయన జీవితములో ఆత్మవిశ్వాసం పెంపొందించింది. మాస్టర్జీ, దొంగవీరుడు, కీర్తిశేషులు, భయం, విశ్వశాంతి, లావాలో ఎర్రగులాబి, సత్యంగారిల్లెక్కడ, జీవన్నాటకం, ఆంధ్రకేసరి వంటి నాటకాల్లో విభిన్న పాత్రలకు రంగస్థలంపై జీవం పోసి ఆ రోజు నుండి ఈరోజు వరకు నాటకాలే ఊపిరిగా బ్రతుకుతున్నాడు.

1964లో “మరో మోహంజోదారో” నాటకం ప్రదర్శింపబడింది. ఆనాడు తెలుగు నాటక రంగంలో అది సంచలనం సృష్టించింది. ఆ నాటకం తాలూకు ప్రభావము ఈనాటికి తెలుగు నాటకాలను వదల్లేదు. ఆ నాటక ప్రయోక్త చాట్ల శ్రీరాములు గారు వారి నాన్న గారన్నట్లుగానే “ఆయనకు లండన్ వెళ్ళే అవకాశం వచ్చింది. తాను దర్శకునిగా రాణించి మరో పదిమంది నటుల్ని తయారుచేయాలని ఆకాంక్ష పెరిగింది. ఆ విషయాన్ని ప్రముఖ నటులు, దర్శకులు, ఎ.ఆర్. కృష్ణ గారితో చెప్పగా ఆయన సహకరించి, 1970లో లండన్ పంపారు. అక్కడి నటీనటుల తీరు, వారి నటన నాటక ప్రదర్శన రక్తి కట్టి, ప్రేక్షకులు నాటకాలు ఎలా ఉంటే చూస్తారు అన్న అంశాలపై అధ్యయనం చేసి "బ్రిటీష్ డ్రామాలీస్" నుండి డ్రామాకోర్సులో డిప్లొమా పొందారు. సోఫోక్లిజ్ రచించిన “ఏంటెగొని” నాటకాన్ని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆరుబయట రంగస్థలంపై ప్రదర్శించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. గొల్లపూడి మారుతీరావుగారి మాంగల్యానికి మరో ముడి నాటకాన్ని ప్రదర్శిస్తూ, భారీ మంగళసూత్రాన్ని నిర్మించారు. నటులకు పులి, తోడేలు వంటి ముసుగులు వేసి పాత్రలు సృష్టించాడు. అబ్బూరి గోపాలకృష్ణ రచించిన చీకటి చెప్పిన కథ మాస్క్ ద్వారా ప్రదర్శించారు. తెలుగు నాటకంలో ఆయన చేసిన ప్రయోగాలు కోకొల్లలు.

వందేళ్ళ పైబడిన నాటకరంగంలో వచ్చిన మార్పులపై పరిశోధన చేసి థియేటర్ ఆర్ట్స్ మీద ఎన్నో వ్యాసములు వ్రాసి, ముఖ్యమంత్రులు, రాష్ట్రమంత్రులు, పద్మభూషణ్ అక్కినేని నాగేశ్వరరావు, డా॥సి. నారాయణ రెడ్డి, రామనాధశాస్త్రి అమెరికాకు చెందిన అప్పాజోస్యుల సత్యనారాయణ ఎంతోమంది పెద్దలచే పురస్కారాలందుకున్నారు.

శ్రీరాములుగారు సినిమాలో నటించాలని ఆ రంగంవైపు వెళ్ళుంటే హీరో కాకపోయినా కారెక్టర్ ఆర్టిస్టుగా రాణించి డబ్బు సంపాదించేవారు. సినిమాలో చేరి తక్కువ స్థాయిలో ఉండడం, ఆయనకు యిష్టం లేదు. ఆయన సినిమాలో చేరి భటుడిగా ఉండేకంటే నాటకరంగంలో యముడిగా ఉండటం ఇష్టం అని చమత్కరించేవారు.

అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో సుడిగుండాలు సినిమాలో ఒక పాత్రలో నటించారు. శ్రీవారి ముచ్చట్లు, స్వప్న, సంగీత, జేగంటలు, విక్రమ్, న్యాయంకావాలి, అగ్నిపుత్రుడు మొదలగు సినిమాలలో నటించినా నాటకానికే పెద్దపీట వేశాడు.

1993లో కొందరు మిత్రులతో కలిసి "రసరంజని" సంస్థను స్థాపించి చాలా నాటకాలు ప్రదర్శింపజేశారు. దాదాపు పాతిక లక్షల రూపాయలు ఖర్చు చేశారు. చాట్ల గారికి ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరమ్మాయిలు, మనుమళ్ళు, మనుమరాళ్ళతో జీవిత నాటకంలో ఆనందం పంచుకుంటున్నారు. ఆయన భార్య శ్రీమతి ఆదిలక్ష్మి తను నటుడిగా పైకెదగడానికి చేయూత నిచ్చిందంటారు.

ఆయన శిష్యులు ఆంధ్రదేశం నలుమూలలా ఉన్నారు. రంగస్థల అధ్యాపకుడిగా, నాలుగు విశ్వవిద్యాలయాలలో పని చేశారు. అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్, గౌతమి, దాసరి అరుణ్కుమార్, ప్రత్యూష వంటి ఎంతోమంది నటీనటులకు నటనలో ఓనమాలు నేర్పారు.

చాట్ల శ్రీరాములు గారు అలరించిన పదవులు :

1. ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమి (ఎ.పి.నాటక అకాడమి) సభ్యులు

2. బోర్డ్ ఆఫ్ స్టడీస్, ఆంధ్ర, ఉస్మానియా, తెలుగు మరియు కల్చరల్ యూనివర్శిటీ సభ్యులు,

3. డ్రామా ఎడ్వయజరీ సభ్యులు, దూరదర్శన్ హైద్రాబాద్

4. ఎడ్వయిజరీ కమిటీ సభ్యులు, థియేటరీ ఆర్ట్స్ తెలుగు యూనివర్శిటీ

5. 1992, 1995 నుండి అవార్డు (నాటకరంగం) కమిటీ సభ్యులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము

6. 2003 నంది T.V అవార్డు కమిటీ ఛైర్మన్

7. 2004 నంది ఫిల్మ్ అవార్డు కమిటీ సభ్యులు

8. నేషనల్ స్కూలు ఆఫ్ డ్రామా ఆధ్వర్యములో వైజాగ్లో జరిగిన థియేటర్ ఫెస్టివలు. రీజనల్ డైరెక్టరుగా వ్యవహరించారు.

అందుకున్న అవార్డులు :

1. ఆంధ్ర నాటక కళాపరిషత్ "ఉత్తమ నటుడి అవార్డు" రెండుసార్లు

2. 1972-1975 మరియు 1978-81 ఉత్తమ దర్శకుడిగా ప్రతిష్టాత్మక కళాసాగర్ అవార్డు.

3. నాటక రంగానికి చేసిన విశేష సేవలకు గాను 1982లో "కళా ప్రవీణ" బిరుదాంకితం.

4. 1984లో "వంశీ" గురజాడ గోల్డ్ మెడల్

5. 1988లో గరికపాటి రాజారావు మెమోరియల్ "నాటకరత్న” అవార్డు.

6. 1990 తెలుగు యూనివర్శిటీ ఫౌండేషన్ అవార్డు

7. 1993 మద్రాసు తెలుగు అకాడమి నుండి ఉగాది పురస్కారము.

8. ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వం వారిచే ఆత్మగౌరవ పురస్కార్ అవార్డ్ మరియు విబయి వేల నగదు బహుమతి.

9. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందారు

Ponnuri Raghavendra