నటనా సార్వభౌమ - కైకాల సత్యనారాయణ

Kaikala Satyanarayana ( Film Actor )

      కైకాల సత్యనారాయణ (1935 జూలై 25 - 2022 డిసెంబరు 23) ఒక సినీ నటుడు, భారత పార్లమెంటు మాజీ సభ్యుడు. 60 సంవత్సరాల సినీజీవితంలో 777 పై చిలుకు సినిమాల్లో నటించాడు. ఒక నటుడిగా అతను పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు చేసాడు. హాస్య, ప్రతినాయక, నాయక, భూమికలెన్నిటినో పోషించాడు. తాను పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా అతను నవరస నటనా సార్వభౌమ అనే బిరుదు పొందాడు. తెలుగు సినీ పరిశ్రమలో ఎస్. వి. రంగారావు తర్వాత అలాంటి వైవిధ్య భరితమైన పాత్రలు పోషించిన వారిలో ఈయన ఒకరు. 1959లో సిపాయి కూతురు అనే చిత్రంతో ఈయన సినీరంగప్రవేశం చేశాడు. తర్వాత ఎక్కువగా ప్రతినాయక పాత్రలు పోషించాడు.

      చిత్ర రంగం & నటన: లెజెండరీ నటుడు ఎస్.వి. రంగారావు గారి తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, క్రూరమైన విలన్‌గా, హాస్యనటుడిగా అంతటి పేరు తెచ్చుకున్న మేటి నటుడు ఆయనే. ఎన్టీఆర్ ప్రతిష్టాత్మక చిత్రం దానవీర శూరకర్ణ లో ఆయన భీముడుగా అద్భుతమైన నటనను కనబరిచారు. శ్రీకృష్ణుడు పాత్ర తప్ప దాదాపు అన్ని రకాల పౌరాణిక, జానపద, సామాజిక పాత్రలను పోషించారు.

ప్రధాన పురస్కారాలు - రఘుపతి వెంకయ్య అవార్డు (2011): తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చేసిన విశిష్ట సేవలకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే అత్యున్నత పురస్కారం ఇది.

నంది అవార్డులు:ఉత్తమ నటుడు: ‘కలియుగ రాముడు’ చిత్రానికి.ఉత్తమ క్యారెక్టర్ నటుడు: ‘బంగారు కుటుంబం’ (1994) చిత్రానికి.నంది ప్రత్యేక జ్యూరీ అవార్డు: ‘మురారి’ (2001) సినిమాలో ఆయన నటనకు లభించింది.

ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు (2017): దక్షిణ భారత సినీ రంగంలో ఆయన చేసిన సమగ్ర సేవలకు గాను లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ పురస్కారంతో సత్కరించారు.

గౌరవ పురస్కారాలు & బిరుదులు నవరస నటసార్వభౌమ: ఆయన పోషించిన వైవిధ్యమైన పాత్రలకు (నాయకుడు, విలన్, హాస్యనటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్) గాను పరిశ్రమ మరియు అభిమానులు ఈ బిరుదును ఇచ్చారు.

కళాప్రపూర్ణ: ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆయనను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది.

 నిర్మాణ సంస్థ: తన తమ్ముడు నాగేశ్వరరావుతో కలిసి రమా ఫిలిమ్స్ బ్యానర్‌ను స్థాపించి కొదమ సింహం, బంగారు కుటుంబం, ముద్దుల మొగుడు వంటి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు.వ్యక్తిగత జీవితం: సత్యనారాయణ గారి భార్య పేరు నాగేశ్వరమ్మ. వారికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

మరణం: వృద్ధాప్య, అనారోగ్య సమస్యల వల్ల ఆయన 2022 డిసెంబరు 23న తన 87వ ఏట పరమపదించారు.

    కైకాల వారిది కృష్ణాజిల్లా గుడివాడ తాలూకా కౌతవరం గ్రామం. వారి తాతగారు (మాతామహులు) కంభంమెట్టు రామయ్య గారింట్లో 1935 జూలై 25వ తేదీ కాపు కుటుంబములో జన్మించారు. అప్పట్లో వారిది పేద కుటుంబం. వారి నాన్నగారు ఒక పలకల వ్యాపారి దగ్గర గుమస్తా. స్కూలు ఉంటే చదువు, లేదా పొలం వెళుతూండేవాడు. గ్రామంలో ఎలిమెంటరీ స్కూలు తర్వాత గుడ్లవల్లేరు హైస్కూలులో చేరాడు. ప్రతిరోజూ కౌతవరం నుండి ఐదుమైళ్ళు నడిచి గుడ్లవల్లేరు హైస్కూలులో చేరాడు. ప్రతిరోజు కౌతవరం నుండి ఐదు మైళ్ళు నడిచి గుడ్లవల్లేరు వెళ్ళి చదువుకొనేవారు. స్కూల్ఫైనల్ వరకు అక్కడే జరిగింది. చిన్నప్పటి నుండి నాటకాలంటే ఆసక్తి ఉండేది. దొడ్లలో అట్ట కిరీటాలు కట్టుకొని పాటలు పాడుతూ స్నేహితులతో కలిసి వేషాలు వేసేవారు. పదవ తరగతి చదువుతున్నప్పుడు ప్రేమలీలలు 

అనే నాటకంలో "విలన్" పాత్ర వేశారు. దానికి వెండి పథకం యిచ్చారు. ఆయనను డాక్టర్ను చేయాలన్నది పెద్దల ఆశయం. ఇంటర్ మీడియట్లో చేరిన తర్వాత ది. గుడివాడ కాలేజి అని పేరున్నది. అది ఇప్పుడు ఎ.ఎన్.ఆర్. కాలేజీగా మార్చారు. ఆయన 1951 నుండి 53 వరకు అక్కడే ఇంటర్మీడియట్ చదివారు. ఒకసారి విజయ వాడ హనుమంతరాయ గ్రంథాలయములో జరిగిన నాటకపోటీలలో పాల్గొన్నారు. ఎన్.టి.ఆర్. "పెళ్ళి చేసి చూడు" సినిమా రిలీజ్ అయింది. నేను నాటకములో స్టేజీమీదకు రాగానే ఒక్కసారిగా హడావిడిమొదలైంది. ఎన్.టి.ఆర్. వచ్చాడంటూ అరుపులు, కేకలు, ప్రదర్శన పూర్తి కాగానే గ్రీన్రూమ్ చుట్టూముట్టిన అభిమానుల హెూరు, నేను ఎన్.టి.ఆర్ను కాదని చెప్పడంతో మీరు ఆయనకు ఏమవుతారు అంటూ ప్రశ్నలు ఆ నాటకాన్ని చూచిన ప్రముఖ దర్శకులు గరికపాటి రాజారావు సినిమాల్లో ఆసక్తి ఉంటే చెప్పు. అవకాశమిస్తానన్నారు. మొదట చదువుకు ప్రాధాన్యత అంటూ సున్నితంగా తిరస్కరించారు.

          అప్పట్లో దుక్కిపాటి మధుసూదనరావు గారి ఆధ్వర్యములో వేసే నాటకాలకు ప్రముఖ సంగీత దర్శకులు పెండ్యాల నాగేశ్వరరావు సంగీత సమకూర్చేవారు. ఆ కంపెనీలో అక్కినేని నాగేశ్వరరావు గారు - హీరోయిన్గా, ప్రభాకరరావు అనే ఆయన హీరోగా వేసేవారు. ఓరోజున ప్రదర్శన ఇస్తుండగా ప్రభాకరరావు గారు స్టేజీమీదనే చనిపోయారు. ఆయన పేరుమీదనే పామర్తి సుబ్బారావు గారు "ప్రభాకర నాట్యమండలి" అనే మరో సంస్థను నెలకొల్పాడు. అందులో కైకాల వారు హీరోవేషం వేశారు. అలా చదువు, నాటకాలు రెండూ వ్యాపకాలు సాగుతుండేవి. డిగ్రీ పూర్తయింది. ఉద్యోగానికి దరఖాస్తులు వేస్తున్న సమయంలో ఆయన క్లాసుమేట్ కె.ఎల్. శ్రీధర్ ఉత్తరం వ్రాశాడు. ఆయన ఎల్.వి.ప్రసాద్ గారి వద్ద అసిస్టెంటు, ఆర్ట్ డైరెక్టరు అందరూ కొత్తవాళ్ళతో ఎల్.వి.ప్రసాద్ “కొడుకులు - కోడళ్ళు" అనే సినిమాలో భూకైలాస్ సినిమాలో అవకాశం వచ్చి చేజారింది; మద్రాసులో మిలటరి సెలక్షన్సులో సెలక్ట్ అయ్యాడు. అది చేజారింది.

   ఒకరోజు వీనస్ స్టూడియోలో ఉండే సౌండ్ ఇంజనీర్ సూర్యనారాయణ ద్వారా ప్రముఖ దర్శకుడు బి.ఎ.సుబ్బారావు గారిని కలిశాడు. (ఎన్.టి.ర్ చిత్రరంగానికి పరిచయం చేసింది ఆయనే) చెంచులక్ష్మి సినిమా పూర్తయింది. లేకుంటే వేషమిచ్చేవాడినంటూ, చక్రపాణి దగ్గరకు పంపాడు. నీవు పనికొస్తావు కాని నా వద్ద వేషాలు లేవు. అని కె.వి.రెడ్డి గారి దగ్గరకు పంపాడు. నీకు తప్పక అవకాశ మిస్తానన్నాడు. ఆయన రావడంలేటయే సరికి, ఆర్.నాగేశ్వరరావు గారికి ఆ వేషమిచ్చారు. కైకాల వారికి ఏడుపొచ్చేసి ఏడ్చాడు. అపుడు కె.వి.రెడ్డిగారు ఓదార్చి తనకు తెలిసిన వాళ్ళందరికి ఇతనిని గురించి చెప్పాడు. డి.ఎల్. నారాయణ గారు సత్యనారాయనను పిలిపించారు. నీకు హీరో రోల్ యిస్తాను. మూడు సంవత్సరాలు ఎక్కడా పని చేయకూడదని నా దగ్గరే పని చేయాలని ఆంక్షపెట్టాడు. సరేనని జమున హీరోయిన్ గా , ఆయన హీరోగా “సిపాయి కూతురు” సినిమా తీశారు. అది చూచి అచ్చం ఎన్.టి.ఆర్ ఉన్నాడని ఐదారు సినిమాల్లో హీరో వేషాలు వచ్చాయి. కాని డి.ఎల్. నారాయణ ఒప్పుకోకపోవడంతో చేయడం కుదరలేదు. సిపాయి కూతురు ప్లాప్క్ వచ్చింది. ఆ తర్వాత డి.ఎల్. నారాయణ ఒప్పుకున్నా, బయట సినిమాలు చేజారిపోయాయి. సేలం, మోడరన్ థియేటర్స్ వారు నిర్మిస్తున్న సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామని చిత్రానికి హీరోగా తీసుకోవాలని విఠలాచార్య గట్టిగా సిఫార్సు చేశారు. మరలా ఆయనే ఒక సలహా యిచ్చాడు. హీరో అయితే గట్టి పోటీ ఉంటుంది. విలన్ పాత్రలైతే పెద్దగా పోటీ ఉండదని "కనకదుర్గా పూజా మహిమ" సినిమాలో విలన్ వేషమిచ్చారు. అలా చేస్తుంటే "అగ్గిపిడుగు" తీశారు. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం రాజనాల, కైకాల ఇద్దరు విలన్స్ 28 రోజుల్లో షూటింగ్ జరిగింది. ఇండస్ట్రీలో ప్రముఖుల దృష్టి నాకర్షించింది- ఆ తర్వాత ఆయన వెనుకకు తిరిగి చూసింది లేదు. ఎన్.టి.ఆర్ హీరో అయితే సత్యనారాయణ విలన్ తప్పక ఉండాల్సిందే! ఎన్.టి.ఆర్. రాముడు భీముడు సినిమాలో ఎన్.టి.ర్ డూప్ గా వేశారు. రామారావు గారు సత్యనారాయణ గారిని ఎంతో అభిమానించేవారు. కృష్ణావతారం సినిమాలో దుర్యోధనుడు పాత్రకు ముందుగా ఎస్.వి.రంగారావును అనుకున్నా ఆయన సొంత సినిమా పనులలో ఉన్న కారణంగా రామారావు గారు పట్టుబట్టి సత్యనారాయణకు ఇప్పించారు. విలన్ గా క్రూరత్వాన్ని ప్రదర్శించే నటుడిగా పేరు సంపాదించుకున్నారు. రామారావు గారు సొంత బ్యానర్ ఎన్.ఎ.టి సంస్థలో నిర్మించిన ఉమ్మడి కుటుంబంలో విషాద పాత్ర యిప్పించారు. మెప్పించాడు, తర్వాత “దేవుడు చేసిన మనుషులు” అలా అలా ఎన్.టి.ఆర్ గారితో పరిచయంతో స్వంత తమ్ముడిలా ఆదరించారు. ఎన్.టి.ఆర్. అవుట్ డోర్ షూటింగ్ లో ఎవరినీ అనుమతించరు కానీ సత్యనారాయణగారికి అలాంటి ఆంక్షలు లేవు. రామారావు పార్టీ పెట్టిన తర్వాత. తెలుగుదేశం పార్టీ తరఫున 1996 మచిలీపట్నం నుండి ఎం.పిగా గెలిశారు. మరలా ఒకసారి ఓడిపోయారు. దానవీర శూరకర్ణ సినిమాలో భీముడుగా నటించారు.

    ఆయనకు భార్యా నలుగురు పిల్లలు - ఇద్దరు అబ్బాయిలు - ఇద్దరమ్మాయిలు ఆయన తమ్ముడు నాగేశ్వరరావుగారు. రమాఫిలింస్ అనే సంస్థను స్థాపించి సినిమాలు తేశారు. సత్యనారాయణగారు కృష్ణుడు పాత్రలు తప్ప అన్ని పాత్రలు వేశారు. క్యారెక్టరు యాక్టర్ గా,విలన్ గా , ఎస్వీరంగారావు తర్వాత, కైకాల సత్యనారాయణగారు మంచిపేరు తెచ్చుకున్న మేటినటుడు. 23-12-2022న స్వర్గస్తులయ్యారు.

రాఘవేంద్ర