రాజనాల కాళేశ్వరరావు (ఫిలిం యాక్టర్) 

   రాజనాల (జనవరి 3, 1925 - మే 21, 1998) తెలుగు సినిమా నటుడు. ఇతని పూర్తి పేరు రాజనాల కాళేశ్వరరావు నాయుడు. దాదాపు నాలుగు దశాబ్దాలకుపైగా 400 పై చిలుకు చిత్రాల్లో వివిధ రకాలైన పాత్రలు పోషించాడు. తెలుగు సినిమా, నాటకాల్లో ఎక్కువగా నటించాడు. కొన్ని తమిళ, కన్నడ, హిందీ చిత్రాల్లో కూడా నటించాడు. మాయ అనే ఒక చిత్రం ద్వారా హాలీవుడ్ లో నటించిన తొలి తెలుగు నటుడిగా ఘనత సాధించాడు. పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో కంసుడు, జరాసంధుడు, మాయల ఫకీరు, భూకామందు, దొంగల నాయకుడు లాంటి ప్రతినాయక పాత్రలలో రాణించాడు.

      ఆంధ్ర ఏకైక విలన్ - రాజనాల

నాలుగు దశాబ్దాల పాటు పౌరాణికం, జానపదం, సాంఘికం చారిత్రక సినిమాలలో ఆయన ఒక్కడే విలన్ గా నటించాడు. అందుకే ఆయనను అందరూ ఆంధ్రా ఏకైక విలన్ గా పిలిచేవారు.

  నెల్లూరుజిల్లా కావలి సమీపంలోని అల్లూరులో రాజనాల పూర్వులు నివసించేవారు. తర్వాత కావలి పట్టణం చేరారు. ఆయన పూర్తిపేరు రాజనాల కాళేశ్వరరావు 3-1-1925 లో బలిజ నాయుడు కుటుంబంలో కావలిలో జన్మించారు. లక్నో యూనివర్శిటీలో యం.ఎ. పూర్తి చేశారు. రెవెన్యూ ఇన్స్పెక్టరుగా ఉద్యోగం చేస్తూండేవాడు. నెల్లూరులో ఆయన F.A చదువుకునే రోజుల్లో 1948లో తన స్నేహితుడు లక్ష్మీ కుమార్రెడ్డి రాజనాల కలసి "నేషనల్ ఆర్ట్స్ థియేటర్స్” నాటక సంస్థను స్థాపించారు. ఆత్రేయ వ్రాసిన "ఎవరు దొంగ" నాటకంలో నటించినందుకు అప్పటి కలెక్టరు రెవెన్యూశాఖలో పనిచేస్తూ ఉద్యోగులను అవినీతి పరులంటావా! అంటూ మండిపడడం జరిగింది. అలాగే ప్రగతి నాటకం ప్రదర్శించినందుకు కలెక్టరు సస్పెండ్ చేశారు. ఉద్యోగం వదలి మద్రాసు సినిమాలో చేరాలని ఆఫీసుల చుట్టూ తిరుగుతుండేవాడు. ఎర్రని శరీర ఛాయతో అందంగా ఉండేవాడు. చుండి నాగభూషణం (రక్త కన్నీరు) గారు, రాజనాల గారు ఇద్దరూ ప్రక్కప్రక్కనే ఇండ్లు ఉండేవి.

    1951 సం||లో టాకీ పితామహుడు M.H. రెడ్డితో కాంట్రాక్టు ఒప్పందంతో నెలకు 200/- రూ. తీసుకొని ప్రతిజ్ఞ సినిమాలో విలన్ వేషం వేసి అలరించాడు. 1953లో ఆ సినిమా విడుదలయింది. హీరోగా తాడేపల్లి లక్ష్మీకాంతారావు (T.L. కాంతారావు) నటించాడు. రెండవ చిత్రం “వద్దంటే డబ్బు" ముసలి పాత్ర వేసి మెప్పించాడు. 19-2-54లో జమీందార్, జయసింహ (1955) బీదల ఆస్తి (1955) రేచుక్క పగటిచుక్క (1959) దొంగల్లో దొర (1957) జానపద బ్రహ్మ విఠలాచార్య పిలుపు మేరకు, మాస్టర్ సోము, స్వామినాథన్ వద్ద, కత్తియుద్దం నేర్చుకొని, ఆర్. నాగేశ్వరరావు మరణించడంతో రాజనాల తెలుగు చిత్రసీమకు ఏకైక ప్రతినాయకుడుగా నిలదొక్కుకున్నాడు. విష్ణుమాయ(1963) శిశుపాలుడుగా శ్రీకృష్ణపాండవీయం (1966) శ్రీకృష్ణాంజనేయ యుద్ధం ఆంజనేయుడుగా (1972) వీరాభిమన్యు దుర్యోధనుడిగా (1965) సత్యహరిశ్చంద్ర (1965) దానవీరశూరకర్ణ ద్రోణాచార్యుడుగా (1977) "వినాయక చవితి"లో శతధ్యనుడుగా (1952) శ్రీకృష్ణావతారంలో శిశుపాలుడు (1967) పాండవ వనవాసం సైంధవుడిగా (1965) ఆడబ్రతుకు (1965) దొరికితే దొంగలు (1965) అన్నా చెల్లెలు (1960) పెళ్ళిసందడి (1959) కుటుంబ గౌరవం (1957) ఖైదీ కన్నయ్య (1962) రాముడు ໖ (1964) ໕ ໖໒ (1957) (1964) ໐໖໖ (1963) చిక్కడు దొరకడు (1967) శ్రీకృష్ణ తులాభారంలో దేవేంద్రుడుగా నటించారు. పిడుగురాముడు (1966) గండికోట రహస్యం (1969) రాజమకుటం (1960) విఠలాచార్య దర్శకంలో కాంతారావు హీరోగా రాజనాల విలన్గా ఎన్నో చిత్రాలలో నటించారు. నటి చంద్రకళ తండ్రినాయక్ నండూరి సమ్మాళ్వార్ దర్శకత్వంలో శ్రీరామాంజనేయ యుద్ధం (1958) బొమ్మల పెళ్ళి సినిమాలో శివాజీ గణేషన్కు రాజనాల డబ్బింగ్ చెప్పాడు. ఆంజనేయుడి పాత్రలో “న భూతో న భవిష్యతి” ఆయన జీవించారు. పౌరాణికాలు, జానపద, చారిత్రక, సాంఘిక సినిమాలలో తన అసమాన నటనా కౌశలముతో అలరించాడు.

 రాజనాల నటుడిగా ఎదుగుతున్న రోజుల్లో మౌంట్రోడ్లోని “కాసినోథియేటర్”లో సినిమా చూస్తూ తన పక్క సీట్లో కూర్చున్న అందమైన అమ్మాయిని చూసి ప్రేమలో పడ్డాడు. తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్ళి చేసుకున్నారు. ఆమె పేరు బి. దేవిశ్రీ వీరికి ఒక కుమారుడు. అతను 10 సం॥ వయస్సులో ఫిట్స్ వచ్చి బాల్కనీపై నుండి క్రిందపడి మరణించాడు. ఈ సంఘటన అతనిని కలచివేసింది (కుమారుడి పేరు కులవర్ధన్)

"మాయాది మాగ్నిఫికేషన్ ” అనే ఇంగ్లీషు సినిమాలో నటించారు. హాలీవుడ్ సినిమాలో నటించిన తొలి తెలుగు నటుడు. ఆయనను రాజనాల రెండవ కుమారుడు కాళీచరణ్ బొంబాయి వెళ్ళి అదృశ్యమయ్యాడు. తిరిగి రాలేదు.

   తెలుగు చిత్ర సీమలో ప్రతినాయక పాత్రలో రారాజుగా 600 సినిమాలలో నటించిన రాజనాల కాళేశ్వరరావు గారు. కావలి కలుగోలు శాంభవి అమ్మవారి భక్తుడు కావలి ఎప్పుడొచ్చినా కలుగోలమ్మ ఆశీర్వాదము తీసుకొని వెళ్ళేవాడు. హిందీ, ఇంగ్లీషు, తెలుగు, తమిళ, కన్నడ భాషలలో నటించారు. తెలుగులో అధిక పారితోషకం తీసుకున్న నటుడు హీరో ఎన్.టి.ఆర్.తో సమానంగా తీసుకునేవారు. నెల్లూరు పత్రికలు, చిత్రజగత్, తరంగణి మద్రాసు పత్రిక, గోటేటి రామారావు గారి మధురవాణి, విజయచిత్ర, పలుపత్రికలు రాజనాల గారి నటనా కౌశలాన్ని ఆకాశాన్ని ఎత్తి రాసేవి. 1990 వచ్చే సరికి పౌరాణిక, జానపద చిత్రాల నిర్మాణం తగ్గిపోయింది.

దాసరి నారాయణరావుగారి “పద్మశ్రీ” నాటకం ముఖ్యపాత్రధారి రాజనాల గారు ఆంధ్రప్రదేశ్ అంతటా పలు ప్రదర్శన లిచ్చారు. రాజనాల దానధర్మాలు ఎక్కువ చేసేవారు. పండుగ రోజుల్లో భిక్షగాళ్ళు ఆయన ఇంటిముందు క్యూ కట్టేవారు. దేశరక్షణ నిధి కోసం, పోలీసు సంక్షేమ నిధి కోసం ఆయన ఎంతో ధనం స్వంతంగా ఇచ్చారు. ఎన్.టి.ఆర్. నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలలో బాధ్యతగల కళాకారుడిగా పాల్గొన్నారు. దానకర్ణుడిగా, భోళాశంకరుడిగా అడిగినవారికి లేదనుకుండా ఆదుకున్నారు రాజనాల, విజయవాడ భాస్కరరావుపేట అగ్నిప్రమాదం జరిగితే కళాకారులు N.T.R.,A.N.R. రాజనాల, కాంతారావు గారు ఆంధ్రదేశమంతా సహాయనిధి సేకరణకు తిరిగారు.

ఎన్.టి.ఆర్ - ఎ.ఎన్.ఆర్ కలిసి ఒక బ్యాచ్ గా , రాజనాల, కాంతారావు, ఒక బ్యాచ్ గా తిరిగితే రాజనాల, కాంతారావుగారికే ఎక్కువ నిధి సేకరించారని ఆనాడు పత్రికలో ప్రముఖంగా ప్రచురించాయి.

 1979లో రాజనాల గారి సతీమణి దేవిశ్రీ గారు మరణించారు. క్రమేణా ఆయన ఆస్తులన్నీ హారతి కర్పూరంలా హరించుపోయాయి. ఆయన చివరి చిత్రం నెంబర్ వన్ S.V. కృష్ణారెడ్డి గారి చిత్రం.

 రాజనాల రెండవ వివాహం చేసుకున్నారు. 1999లో మద్రాసు వదలి హైద్రాబాద్ చేరుకొని అమీర్ పేటలో "రూబి" అపార్ట్మెంటు లో చిన్న ఇల్లు కొనుగోలు చేసికొని జీవించసాగారు. షుగర్ వ్యాధితో అరకులో జరిగిన ప్రమాదంలో కాలు కోల్పోయాడు. దాసరి గారు చిరంజీవిగారు ఆదుకున్నారు. రాజనాల చెన్నై విజయ హాస్పిటల్లో 21-5-1998 సం|| కన్నుమూశారు.

కావలిపేరు నలుదిశలా వ్యాపింపచేసిన నటుడు జ్ఞాపకార్థం 2018 సం॥ రాజనాల కళాపీఠం అభిమానులు ఏర్పాటు చేశారు. ఆయన జన్మదినం పురస్కరించుకొని కావలి రెడ్ క్రాస్ బిల్డింగ్లో పై సంస్థ పేదలకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూంటుంది.

రాఘవేంద్ర