పైడిపాటి జయరాజుల నాయుడు (బాలివుడ్ తొలి తెలుగు హీరో)

      19వ శతాబ్ది చివరి దశకం ప్రపంచ సినీ చరిత్రను మహత్తరమైన మలుపు తిప్పింది. ఆ దశకంలోనే చలన చిత్ర కళపుట్టి, మొత్తం ప్రపంచానికే, మరో ప్రపంచాన్ని చూపెట్టింది. మనుషుల భావోద్వేగాలకు, ఆలోచనలకు, భావ వ్యక్తీకరణకు నటన, సంగీత గానాలకు, కదిలే దృశ్యరూపం, సినిమా వలన చేకూరింది. ప్రపంచ మానవాళికి సరికొత్త వినోదం, అందుబాటులోకి వచ్చింది. అది మొదట గడిచిన ఇరవై ఏండ్లుగా ప్రపంచమంతా సినిమా వెనుక పరుగెడుతూనే ఉంది.

    భారతదేశములో ఈకాలంలోనే సాంస్కృతిక పునరుజ్జీవనయుగం మొదలయింది.

   భారతీయ సంస్కృతి కొత్త మొగ్గలు తొడిగి అభ్యుదయ ఆధునిక మార్గాలలో కాలుమోపి వికాసం వైపు అడుగులు పడినవి కూడా. అంతకు కొద్దికాలం మునుపే, దీనికి తోడు ఆంగ్లభాషా సాహిత్యాల ప్రభావం భారతీయ సమాజంపై బలమైన ముద్రవేయడం మొదలైంది. తత్ఫలితంగా సాంస్కృతిక సాహిత్యరంగాల స్వరూపమే మెల్లమెల్లగా మారసాగింది. ఈ దేశంలో నాటి బ్రిటీష్ ఇండియా చలనచిత్ర కళ ప్రవేశించింది.

   1913 సం॥ రాజా హరిశ్చంద్రతో దాదాపాల్కె వేసిన తొలి అడుగు భారతదేశ వ్యాప్తంగా ఎందరినో సినిమా రంగం వైపు మళ్ళించింది. బెంగాల్లో హీరాలాల్సేన్, థీరేన్ గంగూలి, మహారాష్ట్ర, బాబూరావు, పెయింటర్, చందూలాల్షా, వి.శాంతారాం, ఆర్ట్. షీర్ ఇరాని, మద్రాసులో రఘుపతి వెంకయ్యనాయుడు, R. నటరాజన్ మొదలియార్, రాజకన్ను విన్సెంట్, బెంగుళూరు గుబ్బివీరన్న వంటివారు సినిమా రంగంలోకి వచ్చారు. మూకీ సినిమాలు తీశారు. ఈ పరిణామాలు జరుగుతున్న కాలములో మన హైద్రాబాద్ స్టేట్ పూర్తి స్వతంత్ర రాజ్యంగా ఉన్నది. తనదంటూ స్వంత ఆస్తిత్వంతో ఉనికిని చాటుకుంటున్నది. ఇక్కడి రాజధాని హైద్రాబాద్ నగరం సాంస్కృతిక కళారంగాలకు కేంద్రంగా బాసిల్లుతుంది. ఈ నేపథ్యంలో 1896 సం॥లో హైద్రాబాద్ కు సినిమాను పరిచయం చేసినవాడు. "స్టీవెన్సన్" అనే అంగ్లేయుడు కాగా, 1922లో బెంగాలి థీరేన్ గంగూలి వచ్చి, హరగౌరి, స్టెప్ మదర్, యయాతి వంటి ఆరు మూకీ సినిమాలు, 1922 నుండి 1924 మధ్యకాలంలో తీసివెళ్ళారు. అంతకుముందే జి.ఎఫ్. మదన్ 1908 సం॥లో హైద్రాబాద్ నగరాన్ని ముంచెత్తిన మూసీనది వరదలను చిత్రీకరించి ఉన్నాడు. ఈ పరిణామాలన్నీ హైదరాబాద్ లోని కళాభిమానులను సినిమావైపు మళ్ళించే ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నం తొలి ప్రభావం చూపింది. భారత కోకిలగా పేరొందిన ముత్యాల సరోజనీ నాయుడు W/o. ముత్యాల వరదరాజులు నాయుడు. కుటుంబంలో ఆమె చెల్లెళ్ళు, మృణాలినీదేవి, సునాలినీ దేవి. ఇద్దరూ హైద్రాబాద్ నగరము నుండి సినిమా రంగములోకి ప్రవేశించిన మొదటి వ్యక్తులు, ఆంగ్ల సాహిత్య ప్రభావం షేక్స్ ఫియర్ నాటకాలు వారిని సినిమా వైపు మళ్ళించినది. 1925 సం||లో ప్రఖ్యాత సినీ దర్శకులు, నిర్మాత, నటుడు అయిన హిమాంశురాయ్ తీసిన “ది లైట్ ఆఫ్ ఆసియా” సినిమాలో ముఖ్య భూమికను పోషించి, మృణాళిని, సునాళినీలు. తొలిసారిగా వెండితెరపై కనిపించారు. తర్వాత మూకీల కాలము బొంబాయి వెళ్ళిన హైద్రాబాద్ నటి, రాంప్యారి పాత నగరంలోని "నాగుల చింత" గ్రామానికి చెందిన "రాంప్యారి" 1927 సం॥లో ఒక ప్రధానపాత్ర పోషించి మూకీలతరంలో సినిమారంగానికి పరిచయమయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో హైద్రాబాద్ నుండి బొంబాయి వెళ్ళి వెండితెరపై ఒక వెలుగు వెలిగిన మనవాడు.

   మన తెలుగువారి ముద్దుబిడ్డ ఈనాటి తెలంగాణా ముద్దుబిడ్డ, మన బలిజకాపు ముద్దుబిడ్డ పైడిపాటి జయరాజ్ నాయుడు. వీరి పూర్వీకులు చిత్తూరుజిల్లా నుండి ఉద్యోగాల రీత్యా నైజాం స్టేట్ చేరిన బలిజ నాయుడు కుటుంబం వీరు మధుర బలిజ రాజుల బంధువర్గంలోనివారు.

    పైడిపాటి జయరాజ్ పూర్తిపేరు పైడిపాటి జయరాజులు నాయుడు తండ్రి అచ్యుతనాయుడు. తల్లి తాయారమ్మ, అచ్యుతనాయుడు గారు నిజాం ప్రభుత్వంలో ప్రజా పనుల శాఖలో ఉన్నతాధికారిగా, కరీంనగరంలో పనిచేసేవారు. తాయారమ్మగారు. ముత్యాల సరోజనీ నాయుడు భర్త గోవిందరాజులు నాయుడిగారి తోబుట్టువు అనగా ముత్యాల గోవిందరాజులు నాయుడు గారి స్వయానా మేనల్లుడు, జయరాజ్ గారు. కరీంనగర్లో 28-9-1909 సం॥ జన్మించారు. వీరి అన్నలు, పైడిపాటి సుందరరాజులు నాయుడు, రెండవ వారు దీనదయాళ్ నాయుడు, మూడవవాడు మన జయరాజ్లు నాయుడు. ఈయన నిజాం కాలేజీలో చదువుతున్న రోజుల్లో మిత్రులు. ఆరడుగుల ఆజానుబాహుడివి, అందగాడివి. బొంబాయి వెళ్ళి, సినిమాలలో ప్రయత్నించవచ్చు గదా! అనేవారి ప్రోత్సాహం ఆయనను బొంబాయి వైపు మళ్ళించింది. సినిమాలలో నటించడానికి ముంబాయి బయలుదేరాడు. 1928 సం॥లో సినిమాలలో నటించడానికి బొంబాయి వెళదామని అనుకుంటున్నానని వారి కుటుంబ సభ్యులకు చెప్పేసరికి ఒక్కసారి అందరూ వెళ్ళడానికి వీల్లేదని వ్యతిరేకించారు.

  ఆయన తండ్రి, పెద్ద అన్నయ్యలకైతే కోపం వచ్చేసింది. ముందుగా ఉన్నత చదువులు పూర్తి చేయమని సలహా యిచ్చారు. కాని జయరాజ్ ఏం చేయాలి అన్న విషయంపై తన నిర్ణయం తాను తీసుకొని ఉన్నాడు. సినిమాలలో తన భవిష్యత్తు వెతుక్కోవాలని ముంబాయికి బయలుదేరాడు. 1928 స॥లో అది జరిగింది.

   జయరాజ్ జీవితం హిందీ సినిమా చరిత్రతో బాటు సమాంతంగా సాగింది. అది కూడా సినిమా కథలాగా సంఘర్షణతో కూడి ఎత్తుపల్లాలు అధిగమించి విజయశిఖరాగ్రానికి చేరుకున్న సాహస గాథలాగా ఏడు దశాబ్దాల పాటు మూకీకాలం నుండి టాకీ శకం వరకు సుదీర్ఘంగా సాగిన జయరాజ్ జీవితము; భారతీయ సినిమా చరిత్రకే ఒక సాక్షిభూతంగా నిలుస్తుంది. విభిన్న తరహా చిత్రాలతో విభిన్న తరహా పాత్రలతో, నాలుగు తరాల తారలతో కలిసి సినిమా అభిమానులను అలరించిన మహానటుడు పైడిపాటి జయరాజులు నాయుడుగారు, ఒక రకంగా చెప్పాలంటే తొలితరం భారతీయ చలనచిత్ర పితామహులలో ఒకడు. మన పైడిపాటి జయరాజ్, ఇప్పటివరకు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో 70 సంబరాల పాటు దిలీప్ కుమార్, పైడిపాటి జయరాజ్ వీరిద్దరినే చెప్పుకోవాలి. 1928 జయరాజ్ నిజాం కాలేజీలో డిగ్రీ చదువుతున్నప్పుడు ఇందులాల్ యాజ్ఞిక్, వారి మామ వాడేకర్ల ఆహ్వానంతో ముంబాయి వెళ్ళాడు. చంద్రికా ఫిలింస్ "జగ్మాగాతీ జవానీ" స్పార్క్ంగ్ యూత్ 1929లో నటించడంతో జైరాజ్ సినీ జీవితం మొదలైంది. ఆ వెంటనే వచ్చిన యంగ్ ఇండియా ఫిక్చర్సు వారి “రసేలిరాణి" 1930 సం॥లో ఇది జయరాజ్ రెండవ సినిమా కాగా, హీరోగా నటించిన తొలిచిత్రం. దీనిలో మాధురి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఐదువారాలు ఆడి ఆనాటి సినిమాల కాలంలో సంచలనం కలిగించింది. ఇదో పెద్ద విజయంగా భావించేవారు. ఆరోజుల్లో, ఇదే బ్యానరు. ఫైట్ అన్ టు డెత్ (1930)లో హీరోగా నటించాడు. తర్వాత 1931 సం॥ శారదా ఫిలిమ్స్ కంపెనీలో నెలకు 100/-రూ. జీతంతో చేరాడు. ఆ కంపెనీ మొదటిసారిగా పెరల్ (మహాసాగరుమోతి)లో నటించారు. హీరోయిన్ "జేబున్నీసా" ఆ తర్వాత వీరిద్దరి సినిమాలు, పాట్ఫెయిర్ పాపులయినవి ఈ క్రమములో జయరాజ్ క్వీన్ ఆఫ్ పెయిరీస్, ది ఎనిమి, తుఫానీ తరుణి, షి (1931) మైహీరో (1932) పదకొండు మూకీ చిత్రాలలో నటించాడు. 1931 సం॥లో "ఆలంఆరా"తో దేశంలో టాకీలశకం మొదలైంది. టాకీ చిత్రాలలో ఎవరి పాటలు వారే పాడుకోవాలి. మరి జయరాజ్కు పాడడం రాదు గనుక తాను ప్రసిద్ధ హిందుస్థానీ సంగీత విద్వాంసుడు. ప్రొ॥ దబీర్వద్ద శిష్యరికం చేసి హిందూస్థానీ సంగీతం నేర్చుకున్నాడు. ఆ తర్వాత జయరాజ్ నటించిన తొలి టాకీ చిత్రం “షికారి" (1932) లండన్కు చెందిన ఈస్ట్రన్ ఫిలిం కంపెనీ ఈ సినిమాను, హిందీ, ఇంగ్లీషు భాషలలో తయారుచేశారు. ఆ తర్వాత "మాయాజాల్ జౌరత్కాదిల్” పతితపావన్, జహర్-ఎ-ఇష్క్ (1933) దర్ట్-ఎ-దిల్ - షేర్-ఎ-పరిస్తాన్, వాసవదత్త (1934) షేర్ దిల్ ఔరత్ (1935) బేరోజ్ గార్, గరీబ్ పరివార్ (1936) వంటి హిట్ చిత్రాల్లో హీరోగా నటించి జయరాజ్ అతి కొద్దికాలంలోనే పృథ్విరాజ్ కపూర్, శాంతారాం, సోహ్రాన్మోడి వంటి అగ్రశ్రేణి తారల స్థాయికి చేరుకున్నాడు.

పై చిత్రాలలో పతితపావన్ (మరోపేరు అహల్యా ఉద్గార్) పౌరాణికం. దీనిలో దుర్గా కోటి సరసన నటించిన జైరాజ్ ఆకాలంలో అగ్రశ్రేణి హీరోయిన్లు, దేవికా రాణితో (రవీంద్రనాథ టాగూర్ మేనకోడలు) హమారీబాత్ నర్గీస్తో అంజుమన్, దరోగాజి, రూమీసాగర్ చిత్రాల్లో సురయాతో అమర్కహాని, రాజుప్రత్, రేషమ్, లీలాచిడ్నీస్తో చార్ ఆంఖే, చోటీసేదునియా, నూర్జహాన్తో హంజోలి, నిమ్మితో రాజ్మ్కట్ గీతాబాలితో గరీబి చిత్రంలోనూ, ఇంకా "నిగార్ సుల్తానా” మొహతాబ్ ఖుర్షీద్, నిరూపారాయ్, వంటి వారితో హీరోగా చేశారు.

      జయరాజ్ నటించిన చిత్రాలలో నాలుగైదు తప్ప అన్నీ యాక్షన్ సోషల్ చిత్రాలే, అజంతా ఫిలింస్ కంపెనీ వారికి చేసిన నాలుగు సినిమాల్లో చెప్పుకోదగినవి. "మిల్మజూర్ (1933) ప్రసిద్ధ హిందీ రచయిత ప్రేంచంద్ కథ ఆధారంగా తీసిన ఈ చిత్రంలో జయరాజ్ హీరో "బిష్ణో” హీరోయిన్గా నటించింది. 1936 సం|| కరాచీలో తయారైన "బేరోజ్లర్" తర్వాత గాంబ్లర్ చిత్రాల్లో హీరోగా నటించారు. 1938 ఆర్.ఎస్.చౌదరి తీసిన "రైఫిల్ గర్ల్" (1938)లో విలన్ గా నటించి మెప్పించారు. ఈ చిత్రం జైరాజ్ నటనా ప్రావిణ్యానికి నిదర్శనం. ఇదే సంవత్సరం వచ్చిన "బాబి” సినిమా ఎనభై వారాలు ఆడింది. దీంతో జయరాజ్ హిందీ చలన చిత్ర రంగంలో స్టార్ హెూదా నందుకున్నారు. ఆయనకు నెలకు 600 రూపాయలు జీతం పెరిగింది. (ఇది హీరోలందరి కంటే ఎక్కువ) ప్రకాష్ పిక్చర్సు - బిజ్లి (1939) హిట్, తర్వాత వారే దర్శకత్వం వహించే అవకాశం కల్పించి మాలా (1941) సినిమా తీయించారు. ఆ తర్వాత ప్రతిమ (1945) సాగర్ (1951) రాజఘర్, మోహల్ చిత్రాలకు డైరెక్టు చేశారాయన. సాగర్ సినిమా తీసి నష్టపోయి ఆయన మళ్ళీ నిర్మాతగా సినిమా తీయలేదు.

      దేవికారాణి హీరోయిన్ గా "హమారీబాత్”లో నటించారు. దేవికారాణి చివరిచిత్రం ఇదే! జయరాజ్ సినీ జీవితం 1946 నుండి వరుసగా ఎనిమిది సంవత్సరాలు పాటు చారిత్రాత్మక చిత్రాలలో కీలక భూమికలు పోషించి పాపులరయ్యారు. 1946లో రంజిత్ మూవీటోన్ వారి “రాజపుటానీ"లో శక్తిసింగ్ , షాజహాన్ (1947)లో సైగల్ హీరోకాగా, సంగత్రాషివాజీ పాత్ర పోషించి తన అభిమాన హీరో "సైగల్"తో ఆ తరం హీరోగా నిల్చిపోయారు. ఆ తర్వాత అమర్సింగ్ రాథోడ్, వీరదుర్గాదాస్, రాణా ప్రతాప్ సింగ్, పృథ్వీరాజ్ చవాన్, టిప్పుసుల్తాన్, రజియా సుల్తానా, అల్లాఉదల్, రాణా హమీర్ వంటి చారిత్రక సినిమాల్లో జయరాజ్ హీరోగా నటించాడు. "షహీద్ భగత్ సింగ్ " సినిమాలో చంద్రశేఖర్ అజాద్ పాత్ర పోషించి ఆనాటి ప్రేక్షకులకు మరపురాని పాత్రగా నిలిచింది.

    1966 సం|| నుండి హీరోపాత్రలు మాని క్యారెక్టరు పాత్రలకు మారిన జైరాజ్-బహరోంకే స్వప్పే (1967) నీల్కమల్ (1968) బేటి. తుమారాజైసి (1969) జీవన్ మృత్యు (1970), చోటిబాహు (1971) బాజీగర్, షెహజాద్ (1972) చాలాకూ. ఆలంఆరా (1973) 55 (1974), .. (1975), (1976) వీరూఉసాద్ (1977) ముఖద్దర్ కా సికిందర్ (1978) హీరామోతి, ఇంకార్ (1979) జ్యోతిబనే జ్వాలా, ఫాన్ (1980) ఖూన్ బరే మాంగ్ (1988), అజూబా (1991), బేతాజ్ బాన్షా, దోఫంటూష్ (1994) వంటి వాటితో 200 చిత్రాలకు పైగా నటించారు. జయరాజ్ 70 సం॥పాటు సినీరంగంలో కొనసాగిన నటుల్లో మొదటివారు. తర్వాత లతా మంగేష్కర్, హైద్రాబాద్ చంద్రశేఖర్ (హీరో)లు - అంత సుదీర్ఘకాలం హిందీ సినీ పరిశ్రమలో ఉన్నారు. ఇదొక అరుదైన రికార్డు. ఇవి గాక "హతీంతాయి" (1947) పెద్దహిట్ చిత్రంలో జయరాజ్ హీరో, షకీలా హీరోయిన్ హైద్రాబాద్లో ఈ సినిమా విడుదలైనప్పుడు. నిజాం నవాబు. ప్రత్యేక ప్రదర్శన వేయించుకున్నాడు. ఆ సందర్భములో ఈ సినిమాలో జయరాజ్పై చిత్రీకరించిన "పర్వర్డిగార్ ఆలం" పాటను పదిసార్లు స్క్రీనింగ్ చేయించుకున్నాడు. మల్టిస్టారర్, చార్ల్ చారహే (1959) రాజ్కపూర్, అజిత్, షమ్మి కపూర్, జైరాజ్ కలిసి నటించారు. జైరాజ్ ఇండోరష్యన్ చిత్రం “పరదేశి” (1947)లో రష్యాలో తీసిన “మున్నా” చిత్రం, ఆయన హీరోగా నటించిన చివరి చిత్రం ఖూనీకాన్ ముజ్రింకోన్ (1965) ఇంకా గుజరాతి భాషలో, జోగీదాస్ రెహమాన్, బహురూపి, ఖెమ్రోలోడన్, మరాటిభాషలో, జోగీదాస్ రెహమాన్, బహురూపి, ఖెమ్రోలోడన్, మరాఠి భాషలో చోటాజవాన్, షకిరా చిత్రాలు, రెండు అంతర్జాతీయ చిత్రాలలో నటించిన ఖ్యాతి కూడా దక్కించుకున్నాడు జయరాజ్" మాయాట్వెంటియత్ సెంచెరి ప్యాక్సి వారి - సైన్ అవురామా - చిత్రాల్లో నటించారు.

   సినీ రంగ సేవలకు 1980 సం॥లో భారత ప్రభుత్వం అత్యున్నత “దాదాసాహెబ్ పాల్కె" అవార్డుతో సత్కరించింది.

     1986 సం||లో హైద్రాబాద్ 100 సం॥ సినీ పరిశ్రమ ఉత్సవం సందర్భముగా ఘనంగా సన్మానించింది. 1939 సం|| పంజాబి అమ్మాయి సావిత్రిని పెళ్ళి చేసుకున్నాడు. ఈ దంపతులకు దిలీప్ రాజ్, జయతిలక్, జయశ్రీ, దీప, గీత జన్మించారు. ఆయన సంతానం చివరి రోజుల్లో కుటుంబ స్పర్ధల వలన వ్యాకులతపడిన ఆయన. 11-8-2000 సం॥ మరణించారు. 28-9-2020 సం|| ఆయన 110సం|| జయంతి సందర్భంగా వారిని సముచిత రీతిలో గౌరవించుకోవాలి. గడిచిన కాలంలో సమైక్య రాష్ట్రంగా ఆయనను తెలుగువాడిగా కూడా గుర్తించలేదు. దాదాపాల్కే అవార్డు అందుకున్నా తెలుగువారి జాబితాలో చేర్చడం, మాటదేవుడెరుగు, తెలంగాణా ఏర్పడి ఆరు సంవత్సరాలు దాటింది. గతంలో సినీ అవార్డుల కమిటి వేసి "జైరాజ్" పైరుతో అవార్డు ఇవ్వాలనే నివేదికలు తెప్పించుకున్నారు. వాటిని వెంటనే అమలుచేయాలి. హైద్రాబాద్లో జైరాజ్ కాంస్యవిగ్రహం ఏర్పాటు చేయాలి, ప్రతియేటా జయరాజ్. జయంతుత్సవాలు ప్రభుత్వం నిర్వహించాలి అదే. వారికి ప్రత్యేక తెలంగాణా అర్పించే నిజమైన నివాళి కాగలరు.

1. జయరాజ్ నటించిన మూకీ చిత్రాలు

1. స్పార్క్టింగ్ యూత్ (జమగాతీజవానీ) చంద్రికా ఫిలింస్ కంపెనీ - 1929-30

2. ట్రంప్ ఆఫ్ లవ్ (రశీలీరాణి) యంగ్ ఇండియా పిక్సర్సు - 1930

3. ఫైట్ ఆన్ టు డెత్ (ఖాందానాబెల్స్) యంగ్ ఇండియా పిక్చర్సు - 1931

4. భవానీ నోబోగ్ - యంగ్ ఇండియా ఫిలిమ్స్ - 1931

5. కృష్ణకుమారి (ఫ్లవర్ ఆఫ్ రాజస్థాన్) యంగ్ ఇండియా ఫిలిమ్స్ - 1931

6. పెరల్ (మహాసాగర్ సుమోతి) శారదా ఫిలింస్ 1931

7. ఆల్ ఫర్ లవ్ (దీవానా) శారదా ఫిలింస్ 1931

8. ది ఎనిమి (దుష్మన్) శారదా ఫిలింస్ 1931

9. ది క్వీన్ ఆఫ్ ఫెయిరీస్ (హుస్ఫరి) శారదా ఫిలింస్ 1931

10. షి (బహుదూర్ బేటి) శారదా ఫిలింస్ - 1931

11.మై హీరో (మాతృభూమి) యంగ్ ఇండియా పిక్చర్సు - 1932.

1. N.T. రామారావు మనదేశం సినిమా 24-11-1949 విడుదల అయ్యింది. ఇది శోభనాచల స్టూడియో అధినేత - యర్రంశెట్టి కృష్ణవేణి గారు నిర్మించినది.

2. అక్కినేని నాగేశ్వరరావు సీతారామజననం సినిమా 1-12-1944 సం|| విడుదల అయ్యింది. వీరందరికంటే ముందుగా హీరో అయినవారు-పైడిపాటి జయరాజులు నాయుడు.

      మన చలనచిత్ర చరిత్రను సుసంపన్నం చేసి తనకంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న అతికొద్ది మంది నటులలో పైడిపాటి జైరాజులు నాయుడు ఒకరు. ఈ మహానటుడు తెలుగుబిడ్డ కావడం తెలుగువారందరికీ గర్వకారణం. జైరాజ్ను గురించి హైద్రాబాద్ వ్రాసి, రచయిత, నంది అవార్డు గ్రహీత తాళ్ళ శ్రీకాంత్గారు 8 సం॥ పరిశోధన చేసినారు. ఆ పరిశోధనతోనే ఈ మధ్య ఇంగ్లీషులో "టు బాంబే విత్ లవ్ పి. జయరాజ్, లైఫ్ టైమ్స్ అండ్ ఫిల్మి" పేరిట పుస్తకం వ్రాశారు.

    శ్రీకాంత్ పరిశోధనలో భాగంగా జైరాజ్ కుటుంబసభ్యులను ఆయనతో కలిసి నటించిన వారిని సాంకేతిక నిపుణులను ఇంటర్వ్యూ చేశారు. ఆ తర్వాత ఆ వివరాలతో 264 పేజీలుతో ఈ పుస్తకం వ్రాశాడు. ఇందులో మొదటి భాగంలో జీవితచరిత్ర రెండవ భాగంలో ఆయన నటించిన చిత్రాలు మూడవ భాగంలో పూర్తి సినిమాల జాబితా ఉన్నాయి. ఆయనతో నటించిన యాక్టర్లు, సాంకేతిక నిపుణుల అభిప్రాయాలు చిత్రాల విశేషాలు, ఈ పుస్తకానికి హైలెట్, ఇందులో జైరాజుకు సంబంధించిన దాదాపు 400 ఫోటోలు ఉ న్నాయి. ప్రసిద్ధ దర్శకుడు. పద్మభూషణ్ గ్రహీత శ్యాంబెనెగల్ వ్రాసిన ముందు మాట ఈ పుస్తకానికి స్పెషల్ ఎట్రాక్షన ఈ పుస్తకం జయరాజును గురించి శ్రీకాంత్ చెప్పిన కొన్ని విషయాలు,

   1909 - సెప్టెంబరు - 28 తేదీన, హైద్రాబాద్ స్టేట్లోని కరీంనగర్లో తాయారమ్మ, అచ్యుతయ్య నాయుడు దంపతులకు తొమ్మిదవ సంతానంగా జన్మించాడు జైరాజ్ తండ్రి PWD లో ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యాక కుటుంబమంతా హైద్రాబాద్కు వచ్చి సెటిల్ అయ్యారు. జైరాజ్ నిజాం కాలేజీలో చదువుకున్నాడు. డా॥ ముత్యాల గోవిందరాజులు నాయుడు. జైరాజుకు మేనమామ గోవిందరాజులు నాయుడు భార్య సరోజనీదేవి నాయుడు "షేక్ స్పియరన్ క్లబ్" పేరుతో ఒకనాటక సంస్థను నడిపేది. జైరాజ్ చిన్నన్న దీనదయాళ్ నాయుడు ఆ నాటకాలకు కళాదర్శకత్వం బాధ్యతలను చూసుకునేవాడు. ఒకసారి జైరాజ్క షేక్ స్పియర్ నాటకం “యాజు లైక్ ఇట్"లో ఒక పాత్ర పోషించే అవకాశం వచ్చింది. ఆ నాటకం ద్వారా జైరాజ్ నటనకు నాందిపడింది. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల జైరాజ్ తన డిగ్రీ చదువును మధ్యలోనే ఆపి 20/రూ. తీసుకొని 1929లో బొంబాయి రైలు ఎక్కాడు.

   బొంబాయిలో తన ఫ్రెండ్ సహాయంతో ఒక నౌకా నిర్మాణకేంద్రంలో నౌకను శుభ్రం చేసే పనిలో కుదిరాడు. కొంతకాలం తర్వాత అకౌంటింగ్ సెక్షనుకు ప్రమోట్ అయ్యాడు.

  బొంబాయిలో మహావీర్ స్టూడియోస్ లో పనిచేసే తన ఇంకొక చిన్ననాటి స్నేహితుడు రంగయ్యను కలవడంతో జైరాజ్ జీవితం మలుపు తిరిగింది.

     ఒకరోజు జయరాజు రంగయ్యతో కలిసి ఒక సినిమా సంస్థకు వెళ్ళడం అక్కడ ప్రఖ్యాత నాటక రచయిత "మామా వరేర్కర్"ను కలవడం ఆయన జయరాజ్న చూసి ముగ్ధుడై సినిమాలో నటించమని చెప్పడం "జగ్మగ్ తీ జవానీ” అనే సినిమాలో హీరోఫ్రెండ్ పాత్రలో నటించడం చకచకా జరిగిపోయాయి. దాంతో ఆయన సినీ జీవితం మొదలైంది.

భట్టరుశెట్టి పద్మారావు రాయలు