తెలంగాణ రాష్ట్రంలో పెరిగిన మెడికల్ సీట్లు
తెలంగాణ రాష్ట్రంలో పెరిగిన మెడికల్ సీట్లు
రాష్ట్రంలో పెరిగిన మెడికల్ పీజీ సీట్లు
ప్రభుత్వ కళాశాలల్లో 300, ప్రైవేటులో 469..
హైదరాబాద్: రాష్ట్రంలో 2026-27 సంవత్సరానికి గాను వైద్యవిద్య పీజీ సీట్ల సంఖ్య భారీగా పెరిగింది. కాళోజీ నారాయణ రావు ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోని ప్రభుత్వ, ప్రయివేటు వైద్య కళాశాలల్లో కలిపి కొత్తగా అందుబాటులోకి వచ్చిన సీట్లు 769 వరకు ఉన్నాయి. శుక్రవారం జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) పరిధిలోని 'మెడికల్ అసె స్మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్'(ఎంఏబీ) దేశ వ్యాప్తంగా పెంచిన సీట్ల వివరాలు వెల్లడించింది. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 300 వరకు సీట్లు పెరిగాయి. ఈసారి 400 సీట్లను పెంచాలని వైద్యవిద్య సంచాలక (డీఎంఈ) విభాగం ప్రతిపా దనలు పంపగా 300 పెంచేందుకు ఎన్ ఎంసీ ఆమోదించింది. పెరిగిన సీట్లతో కలిపి ప్రభుత్వ కళాశాలల్లో మొత్తం సంఖ్య 1766 కానుంది. ఇక ప్రయివేటు వైద్య కళాశాలల్లో 469 సీట్లను పెంచగా.. 2419 అయ్యాయి.
రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ, ప్రైవేటుల్లో కలిపి 4185 పీజీ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే పీజీ నోటిఫికేషన్ విడుదల చేసిన కాళోజీ వర్సిటీ అర్హుల మెరిట్ జాబితా విడు దల చేయనుంది. రాష్ట్రంలో భూపాల పల్లి, జగిత్యాల తదితర కాలేజీల్లో ఈసారి పీజీ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. కాలేజీల వారీగా కోర్సులు, సీట్ల వివరాలపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత రానుందని వీసీ ఆచార్య రమేశడ్డి తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో ప్రైవేటు కాలేజీల్లో మరో 175 వరకు యూజీ సీట్లు మిగిలిపోవడం గమనార్హం. కాళోజీ వర్సిటీ ఈనెల 16 వరకు స్పెషల్ స్ట్రే వేకెన్సీ కింద వీటిని భర్తీ చేసేందుకు నిర్ణయించింది.