తెలంగాణలో ఇంటింటికి ఇంటర్నెట్ - Kaapu Lights – Community Platform

తెలంగాణలో ఇంటింటికి ఇంటర్నెట్

By PONNURI . RAGHAVENDRA November 7, 2026

తెలంగాణలో గ్రామీణ ఇంటర్నెట్ విస్తరణకు 3,185 కోట్లు

12,769 పంచాయతీలకు రింగ్ నెట్వర్క్ కనెక్టివిటీ

కేంద్రంతో టీ ఫైబర్ ఒప్పందం

దిల్లీ, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటింటికీ ఇంటర్నెట్ సదుపాయం అందించే కీలక ప్రక్రియకు మార్గం సుగమమైంది. తెలం గాణలో హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను విస్తరిం చేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.3,185 కోట్ల ఆర్థిక సహాయాన్ని ఆమోదించింది. 'అమెండెడ్ భారత్ నెట్ ప్రోగ్రామ్(ఏబీపీ)' అమలులో భాగంగా.. తెలంగాణ ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వ డిజిటల్ భారత్నిధి(డీబీఎన్) అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సంచార్భవన్లో శుక్రవారం తెలంగాణ ఇంటర్నెట్ మౌలిక సదుపాయాల సంస్థ తొలి సమావేశాన్ని నిర్వహించారు. ఈ మంలో డీబీఎన్, టెలికాం శాఖ.. తెలంగా గ్రామీణ ఇంటర్నెట్ మౌలిక సదుపాయా సంస్థ(ట్రైకిల్), బీఎస్ఎన్ఎల్, టీ ఫైబర్ ప్రతినిధులు ఒప్పందంపై సంతకాలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో తెలం గాణలో గ్రామీణ డిజిటల్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంతో పాటు డిజిటల్ అంతరాన్ని తగ్గించేందుకు ఈ ఒప్పందం దోహదపడనుంది. ఈ కార్యక్రమంలో డీబీఎన్ అడ్మినిస్ట్రేటర్ శ్యామలిమిశ్రా, డైరెక్టర్ హర్ష్ శర్మ, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ దినేశ్ గార్గ్, తెలంగాణ ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దురిశెట్టి, ట్రైకిల్ సీఈవో, టీ ఫైబర్ ఎండీ వేణు ప్రసాద్ పన్నీరు, బీఎస్ఎన్ఎల్ భారత్నెట్ పీజీఎం జి. రాజారామ్మోహన్, బీఎస్ఎన్ ఎల్ డైరెక్టర్ సుధాకర్, సంజీవ్ సిన్హా, ముకేశుప్తా, తదితర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొ న్నారు. తెలంగాణ నుంచి వర్చువల్గా రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు వికాస్రాజ్, నవీన్ మిత్తల్, కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో లక్షల కుటుంబాలకు ఆన్లైన్ విద్య, టెలీమెడిసిన్, ఈ-గవర్నెన్స్, రైతు వేదికలు, ఇతర పౌర సేవలు మరింత చేరువ కానున్నట్లు కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ శుక్రవారం పేర్కొంది.

రాష్ట్రంలో డిజిటల్ విప్లవాన్ని సృష్టించాలనే లక్ష్యంతో సీఎం రేవంత్రెడ్డి ఈ ప్రాజెక్టుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం.. 2026 జూన్లో ట్రైకిల్ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టును ట్రైకిల్ ఆధ్వర్యంలోనే అమలు చేయను న్నారు. మొత్తం 12,769 గ్రామ పంచాయతీల పరిధిలో నెట్వర్క్ అభివృద్ధి చేపట్టనున్నారు. ప్రస్తుతం లీనియర్ విధానంలో ఉన్న 1,946 గ్రామ పంచాయతీలను రింగ్ టోపాలజీకి అప్గ్రేడ్ చేయనున్నారు. మరో 36 గ్రామ పంచాయతీల్లో కొత్తగా రింగ్ నెట్వర్క్ ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే 10,787 గ్రామ పంచాయతీల్లో రింగ్ టోపాలజీ నెట్వర్క్ అందుబాటులో ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో కనెక్షన్కు సుమారు రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించే ప్రతిపాదనకు ఆమోదం లభించింది. దీని ద్వారా 2.93 లక్షల గ్రామీణ కుటుంబాలకు బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్లు కల్పించనున్నారు.

ఖమ్మం, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో కొత్త ఆప్టి కల్ ఫైబర్ కేబుల్(ఓఎఫ్సీ) నెట్వర్క్ ఏర్పాటుకు అవ సరమైన టెండర్లు పిలిచేందుకు అనుమతి లభించింది. రూ.3,185 కోట్ల ప్రాజెక్టు వ్యయంలో భాగంగా.. ఈ నెట్వర్క్ నిర్మాణంతో పాటు పదేళ్ల పాటు నిర్వహణ బాధ్యతలను కూడా అప్పగించనున్నారు.

Live
Community Chat
AI Assistant
AI: Hello! How can I help you today?