ఆంధ్రప్రదేశ్ జిల్లా మరియు మండల ఎన్నికల్లో కూటమి ఘనవిజయం
ఆంధ్రప్రదేశ్ జిల్లా మరియు మండల ఎన్నికల్లో కూటమి ఘనవిజయం
ఆంధ్రప్రదేశ్ జిల్లా పరిషత్ ఎన్నికల్లో కూటమి ఘనవిజయం
మండల పరిషత్ పోరులోనూ విజయభేరి
ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అదే దూకుడు
జగన్ నియోజకవర్గం పులివెందులలోనూ వైకాపా ఘోర పరాజయం.
ఆంధ్రప్రదేశ్ ZPTC & MPTC ఎన్నికల ఫలితాలు
మొన్న పట్టణం..
ఇప్పుడు పల్లె .. ఫలితం ఒక్కటే!
మున్సిపల్ ఎన్నికల్లో సాధించిన ఫలితాల్నే పరిషత్ ఎన్నికల్లోనూ కూటమి పునరావృతం చేసింది. పల్లె, పట్నం అన్న తేడా లేకుండా అన్ని ప్రాంతాలు, వర్గాల ప్రజలు కూటమినే కోరుకుం టున్నారనడానికి ఈ ఎన్నికలు అద్దం పట్టాయి. సార్వత్రిక ఎన్నికల తర్వాత రెండున్నరేళ్లకు జరి గిన మున్సిపల్, పరిషత్ ఎన్నికలు కూటమి ప్రభుత్వ పాలనకు రిఫరెండం వంటివే! ఈ రెండున్నరేళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజాదరణ చూరగొన్న యడానికి.. రాష్ట్రంలో శాంతియుత పరిస్థితుల్ని, సుస్థిర అభివృద్ధిని కోరుకుంటున్నారనడానికి వారి ఏకపక్ష తీర్పే నిదర్శనం. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి 94 శాతం స్ట్రైక్ రేట్ సాధించింది. కూటమికి నగరపాలక సంస్థల్లో 60.34 శాతం ఓట్లు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో 60.12 శాతం ఓట్లు వచ్చాయి. పరిషత్ ఎన్నికల్లోనూ అది పునరావృ తమైంది. పురపాలక ఎన్నికల్లో అనంతపురం కార్పొరేషన్తో పాటు, నందికొట్కూరు, బేతం చెర్ల, నాయుడుపేట మున్సిపాలిటీలను మాత్రమే వైకాపా గెలవగలిగింది. ఇప్పుడు జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలనూ ఆ పార్టీ స్వల్ప సంఖ్య లోనే గెలిచింది.
ZPTC ఫలితాలు – పార్టీ వారీగా
నవంబర్ 8 ఉదయం అందుబాటులో ఉన్న నివేదికల ప్రకారం
పార్టీ గెలిచిన స్థానాలు
తెలుగుదేశం (TDP) 384
జనసేన (JSP) 70
బీజేపీ (BJP) 19
వైఎస్సార్‌సీపీ (YSRCP) 57
ఇతరులు / స్వతంత్రులు 4
కూటమి మొత్తం 473
మొత్తం ZPTC స్థానాలు: 659
ఏకగ్రీవంగా గెలిచినవి: 77
ఎన్నికలు జరిగినవి: 582
ఇంకా 48 స్థానాల ఫలితాలు పెండింగ్‌లో ఉన్నాయి.
MPTC ఫలితాలు – పార్టీ వారీగా
పార్టీ గెలిచిన స్థానాలు
తెలుగుదేశం (TDP) 4,754
జనసేన (JSP) 945
బీజేపీ (BJP) 120
వైఎస్సార్‌సీపీ (YSRCP) 1,583
ఇతరులు / స్వతంత్రులు 187
కూటమి మొత్తం 5,819
మొత్తం MPTC స్థానాలు: 9,821
ఏకగ్రీవంగా గెలిచినవి: 2,051
ఎన్నికలు జరిగినవి: 7,767
మూడు స్థానాల్లో ఎన్నికలు జరగలేదు.
ఈ నివేదికలో 9,640 స్థానాల ఫలితాలు ప్రకటించబడ్డాయి.