CA ఫౌండేషన్ పరీక్షల్లో హైదరాబాద్ అమ్మాయికి ప్రధమ ర్యాంక్ - Kaapu Lights – Community Platform

CA ఫౌండేషన్ పరీక్షల్లో హైదరాబాద్ అమ్మాయికి ప్రధమ ర్యాంక్

By PONNURI . RAGHAVENDRA November 7, 2026

 సీఏ ఫౌండేషన్ పరీక్షల్లో హైదరాబాద్ అమ్మాయికి ప్రథమ ర్యాంకు

400కు 361 మార్కులు సాధించిన మహేక్ గుప్తా

ఏపీకి చెందిన చౌదల్ల మహాలక్ష్మికి 16వ ర్యాంకు

హైదరాబాద్ :

CA ఫౌండేషన్ పరీక్షల్లో హైదరాబాద్కు చెందిన మహేక్ గుప్తా ప్రథమ ర్యాంకు సాధించారు. ఆమె 400 మార్కులకు 361 పొంది జాతీయస్థా యిలో సత్తా చాటారు. హరియాణా లోని హిసారు చెందిన కనిష్క సైతం 361 మార్కులే సాధించడంతో వారిద్దరికీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛార్టెర్డ్ ఎకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) ప్రథమ ర్యాంకే కేటాయించింది. సీఏలో తొలి దశ అయిన ఫౌండేషన్ కోర్సు ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. అజ్మీర్కు చెందిన ఖండేల్వాల్, చెన్నైకి చెందిన జయంత్లకు సమానంగా 359 మార్కులు రావడంతో వారిద్దరికీ రెండో ర్యాంకు కేటాయించారు. గ్వాలియర్లో పరీక్ష రాసిన వైభవి సింఘాల్ 358 మార్కులతో మూడో ర్యాంకులో నిలిచారు. తొలి మూడు ర్యాంకుల్లో ఒకటి, మూడు ర్యాంకులు అమ్మాయిలే దక్కించుకోవడం విశేషం. హైదరాబాద్లో శిక్షణ పొందిన ఆంధ్రప్రదేశ్కు చెందిన చౌదల్ల మహాలక్ష్మి 16వ ర్యాంకు సాధించారు.

18.93 శాతం ఉత్తీర్ణత..

సెప్టెంబరులో జరిగిన ఫౌండేషన్ పరీక్షలకు మొత్తం 1,04,240 మంది హాజరయ్యారు. వారిలో 19,736 మంది(18.93 శాతం) పాసయ్యారు. అబ్బా యిలు 53,398 మంది పరీక్షలు రాయగా.. అందులో 10,931 మంది(20,47 శాతం) ఉత్తీర్ణులయ్యారు. అమ్మాయిలు 50,842 మందికి 8,805 మంది(17. 32 శాతం) పాసయ్యారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధుల్ని ఐసీఏఐ జాతీయ అధ్యక్షుడు ప్రసన్నకుమార్ అభినందించారు.

Live
Community Chat
AI Assistant
AI: Hello! How can I help you today?